హోమ్ /వార్తలు /తెలంగాణ /

Amit Shah| Revanth: CM KCR పై అమిత్​షావి మాటలే తప్ప.. చేతలుండవ్​.. టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి షాకింగ్​ కామెంట్స్​

Amit Shah| Revanth: CM KCR పై అమిత్​షావి మాటలే తప్ప.. చేతలుండవ్​.. టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి షాకింగ్​ కామెంట్స్​

రేవంత్ రెడ్డి, అమిత్​ షా (ఫైల్​)

రేవంత్ రెడ్డి, అమిత్​ షా (ఫైల్​)

అమిత్ షా తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు తెలంగాణ ప్రజానీకం తరఫున కొన్ని ప్రశ్నలు సంధిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రశ్నలకు అమిత్ షా నుంచి సమాధానం రాలేదంటూ బీజేపీ సభ ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి ఘాటు ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి ...

  బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జరిగిన విషయం తెలిసిందే. ఈ సభలో ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  (Union Minister Amit Shah) పాల్గొన్నారు. అయితే అమిత్ షా తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు తెలంగాణ ప్రజానీకం తరఫున కొన్ని ప్రశ్నలు సంధిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC chief Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రశ్నలకు అమిత్ షా నుంచి సమాధానం రాలేదంటూ బీజేపీ సభ ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

  ''తుక్కుగూడలో అమిత్ షా ప్రసంగం కొండంత రాగం తీసి… అన్నట్టుగా ఉంది. తెలంగాణ ప్రజల తరపున మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. కేసీఆర్ (CM KCR) కుటుంబ అవినీతి పై ఆర్భాటపు ప్రకటనలే తప్ప ఆచరణతో కూడిన చర్యలు ఉండవని తేలిపోయింది. అంతేలే షా జీ… మీ చీకటి మిత్రుడి పై ఈగవాలనివ్వరుగా!!'' అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.

  కాగా, రేవంత్ అమిత్​ షాకి రాసిన లేఖలో 9 ప్రశ్నలను సంధించారు. కేసీఆర్ (CM KCR) కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనక రహస్యమేమిటని ఈ లేఖలో రేవంత్ రెడ్డి.. అమిత్ షా‌ను ప్రశ్నించారు. పంట కొనుగోలు చేయకుండా ఆడిన రాజకీయ డ్రామాలో.. ధాన్యం రైతుల మరణాలకు భాద్యులెవరో సమాధానం చెప్పాలన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటుపై అనుచితంగా మాట్లాడిన మోదీ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు అంటూ బీజేపీ మాట తప్పిందని విమర్శించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

  మరోవైపు సంజయ్ ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా శనివారం హైదరాబాద్ శివారు తుక్కుగూడ (మహేశ్వరం)లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో నయా నిజాంను గద్దె దింపుదామా? వద్దా? అయితే మీరంతా పిడికిలి బిగించి నాతో ‘భారత్ మాతాకీ జై’ నినాదం చేయండి.. అంటూ పార్టీ కార్యకర్తల్లో షా ఉత్సాహం నింపారు.

  ‘బండి సంజయ్ పాదయాత్రను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. ఇవాళ్టి సభలో ఆయన ప్రసంగం విన్న తర్వాత అనిపించింది ఏంటంటే.. తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడానికి నాలాంటి నేతలు రానవసరమే లేదు.. సంజయ్ సింగిల్ హ్యాండుతో టీఆర్ఎస్ ను కూల్చేస్తాడని స్పష్టమైపోయింది. సంజయ్ పాదయాత్ర ఒక పార్టీకి వ్యతిరేకంగానో, ఒకరిని గద్దెదించాలనో ఉద్దేశించింది కాదు.. కుటుంబ పాలనను అంతం చేయడానికి, రాష్ట్రంలో దళిత, గిరిజనుల కలలు సాకారం కావడానికి ఉద్దేశించింది. ఆ పనిలో భాగంగానే కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్ ను పీకి అవతలపారేయబోతున్నాం” అన్నారు అమిత్​ షా.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Amit Shah, CM KCR, Congress, Revanth Reddy, Telangana Politics

  ఉత్తమ కథలు