టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి(TPCC chief Revant Reddy )సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (KTR)లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాహుల్ గాంధీ (Rahul gandhi) పర్యటన, వరంగల్ రైతు సభ ప్రకంపనలు సృష్టించిందని అన్నారు. ఇన్నాళ్లు కలుగులో దాక్కున్న వాళ్లంతా రాహుల్ సభతో బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. బీజేపీ (BJP), టీఆర్ఎస్ (TRS), ఎంఐంఎం (MIM) నాయకులు మూకుమ్మడిగా కాంగ్రెస్ (Congress)పై దాడి చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వరంగల్ సభ వేదికగా కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన చారిత్రాత్మక డిక్లరేషన్‌ను (Farmers Declaration) రైతుల ఆమోదం పొందిందని తెలిపారు. మంత్రి కేటీఆర్ పొంతనలేని మాటలు మాట్లాడుతున్నాడని, రాహుల్ పొలిటికల్ టూరిస్ట్ (Political tourist) అని కేటీఆర్ అంటున్నాడని, కేటీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎదుటివాళ్లను అనే ముందు నాలుగు వేళ్లు తమనే చూపిస్తాయని కేసీఆర్ (Cm KCR), కేటీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు. పారిపోవడంలో, ఇచ్చిన హామీలు విస్మరించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టరేట్ పొందారని అన్నారు.
కాంగ్రెస్‌లో రాజకీయ ఓనమాలు దిద్దిన నీ తండ్రి..
కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టేంది కాంగ్రెస్ పార్టీయేనని. ఈ పార్టీ జెండా నీడలో రాజకీయ ఓనమాలు దిద్దిన నీ తండ్రికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌ను తిడుతున్నావంటే ముందు కేసీఆర్ చెంపలు వాయించాలని రేవంత్ అన్నారు. కాంగ్రెస్‌లో చేరి తన తండ్రి తప్పు చేశారని.. తర్వాత తమ పార్టీపై మాట్లాడితే బాగుంటుందంటూ ఆయన హితవు పలికారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఓటమితోనే మొదలైందని.. సింగిల్ విండో డైరెక్టర్‌గా, ఎమ్మెల్యేగా రెండోసారి ఓడిపోయారని రేవంత్ గుర్తుచేశారు.
కేసీఆర్ కరీంనగర్ పారిపోయాడని..
కాగా, సిద్ధిపేట ఎమ్మెల్యేగా వున్న సమయంలో కేసీఆర్ కరీంనగర్ పారిపోయాడని.. అక్కడ ప్రజలు తిరస్కరిస్తారేమోనని పాలమూరు, అక్కడి జనాన్ని వంచించిన తర్వాత మెదక్ పార్లమెంట్ స్థానానికి పారిపోయాడని ఆయన దుయ్యబట్టారు. మెదక్ ప్రజల ఆకాంక్షలను బొందపెట్టిన తర్వాత గజ్వేల్ శాసనసభకు పారిపోయారని .. పారిపోవడానికి పట్టా ఎవరికైనా వుందంటే అది కేసీఆర్‌కే వుందంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. పారిపోవడంలో కేసీఆర్ డాక్టరేట్ పొందారని.. ఎదుటివాళ్లను అనే ముందు నాలుగు వేళ్లు తమనే చూపిస్తాయని రేవంత్ హితవు పలికారు.
తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ సాక్షిగా రైతులకు భరోసా కల్పించామని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ (congress) ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ విధానానికి, రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధర, ధరణీ పోర్టల్ రద్దు సహా 9 తీర్మానాలు తండాలలో, గూడెలలో, మారుమూల పల్లెల్లోనూ ప్రజలకు చేరాయని రేవంత్ పేర్కొన్నారు. దీనిపై తమకు సంతోషంగా వుందన్నారు. టీఆర్ఎస్, కేటీఆర్ అహంభావంతో ప్రజాస్వామ్యం అంటే అవగాహన లేని విధంగా మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. యూత్ కాంగ్రెస్‌లో పనిచేసిన సమయంలో కేసీఆర్ (kcr) సింగిల్ విండో డైరెక్టర్‌గా ఓడిపోయినా.. ఆయనను అప్పటి కాంగ్రెస్ పెద్దలు ఛైర్మన్‌గా నియమించారని టీపీసీసీ చీఫ్ తెలిపారు. రాహుల్ గాంధీ (rahul gandhi) అమేధీలో ఓడిపోయారని.. కానీ వయ్‌నాడ్‌లో గెలిచారని రేవంత్ గుర్తుచేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, KTR, Rahul Gandhi, Revanth Reddy, Telangana Politics, TS Congress