Home /News /telangana /

TS POLITICS TPCC CHIEF REVANTH REDDY CONVINCING KONDA VISHWESHWAR REDDY NOT TO JOIN BJP SOON AK

Konda Vishweshwar Reddy: కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరతారా ?.. ఆ కీలక నేత బుజ్జగిస్తున్నారా ?

కొండా విశ్వేశ్వర్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కొండా విశ్వేశ్వర్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Konda Vishweshwar Reddy: టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కాంగ్రెస్‌లో చేరి చేవేళ్ల ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆ తరువాత కాంగ్రెస్‌కు కూడా దూరంగా ఉంటూ వచ్చారు.

    రాజకీయాల్లో నేతలు పార్టీలు మారడం సహజం. తెలంగాణలోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవడమే లక్ష్యంగా కొందరు నేతలు పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు. గెలిచే పార్టీలో చేరాలని భావిస్తున్నారు. వీరిలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) కూడా ఉన్నారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కాంగ్రెస్‌లో చేరి చేవేళ్ల ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆ తరువాత కాంగ్రెస్‌కు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. అయితే రేవంత్ రెడ్డి (Revath Reddy) టీపీసీసీ చీఫ్ అయిన తరువాత ఆయన మళ్లీ కాంగ్రెస్ గూటికే వెళతారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

    కాంగ్రెస్, బీజేపీల్(BJP)లో చేరే విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కొద్దిరోజుల క్రితం కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 14న మహేశ్వరంలో జరగబోయే బీజేపీ సభలో అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరతారబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఆయన ఇంకా నిర్ణయం తీసుకున్నారా ? లేదా ? అన్నది మాత్రం తెలియడం లేదు.

    మరోవైపు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరకుండా ఉండేలా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఈ విషయంలో తొందరపడొద్దని.. మరికొంతకాలం వేచి ఉండాలని ఆయన మాజీ ఎంపీకి సూచిస్తున్నట్టు సమాచారం. నిజానికి తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ను సమర్థవంతంగా ఢీకొట్టే పార్టీని గుర్తించి.. అందులో చేరాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొంతకాలంగా ఎదురుచూస్తున్నట్టు ఆయనకు సన్నిహితంగా ఉండేవారు చెబుతున్నారు.

    BJP PrajaSangrama Yatra: Prabhas మిర్చి డైలాగ్​ను రిపీట్​ చేసిన బండి సంజయ్​.. ఒక్క ఛాన్స్​ ఇస్తే గుండెల్లో పెట్టుకుంటామంటూ..

    Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇచ్చిన వార్నింగ్ ఎవరికి ?.. సీనియర్ నేతల్లో మథనం ?

    ఈ విషయంలో ఆయన కాంగ్రెస్, బీజేపీలకు పలు సందర్భాల్లో మద్దతు ఇచ్చినట్టు గుర్తు చేస్తున్నారు. టీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఇందుకోసం ఎవరితో కలిసి పని చేయాలనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆర్థికంగానూ బలమైన వ్యక్తి కావడంతో.. కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఎలాగైనా తమ పార్టీలోకి తీసుకురావాలని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ భావిస్తున్నాయి. అయితే ఆయన మాత్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Konda Vishweshwar reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు