Home /News /telangana /

TS POLITICS TPCC CHIEF REVANTH REDDY APOLOGIZED PUBLICLY TO CONGRESS MP KOMATIREDDY VENKATREDDY PRV

Revanth reddy | Komatireddy: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి​ సంచలన వీడియో.. కోమటిరెడ్డికి క్షమాపణలు చెబుతూ..

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పారు. చండూరు సభలో అద్దంకి దయాకర్‌ కోమటిరెడ్డిపై చేసిన పరుష వ్యాఖ్యలకు రేవంత్‌ బహిరంగంగా క్షమాపణ కోరారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India
    భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి (TPCC chief Revanth Reddy ) క్షమాపణ చెప్పారు. చండూరు సభలో అద్దంకి దయాకర్‌ కోమటిరెడ్డిపై చేసిన పరుష వ్యాఖ్యలకు రేవంత్‌ బహిరంగంగా క్షమాపణ కోరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి (MP Komatireddy VenkatReddy) అంటే తనకు గౌరవం ఉందన్నారు. తెలంగాణ (Telangana) సాధనలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. క్రమశిక్షణను ఉల్లంఘించిన దయాకర్‌ (Addhanki dayakar)పై చర్యలు ఉంటాయన్నారు. తదుపరి చర్యల నిమిత్తం ఈ విషయాన్ని క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డికి తెలియజేస్తానని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక, ఈ రోజు నుంచి మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్ర చేపట్టనుంది. ఇందుకు కొన్ని గంటల ముందు వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడం గమనార్హం. మరి రేవంత్ క్షమాపణపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది.



    కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల సన్నాహక సమావేశాలకు పార్టీ అధిష్టానం తనను ఆహ్వానించలేదని ఆరోపించారు. సమావేశాల గురించి తనకు తెలియదని.. కనీసం సమాచారం ఇవ్వలేదని చెప్పారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌పై చర్యలు తీసుకోని పీసీసీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను దూషించిన వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అద్దంకి దయాకర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు ఈ విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా క్షమాపణ చెప్పాలన్నారు.



    అసలేం జరిగింది?

    చండూరు సభలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ... ఓ వైపు తన నియోజకవర్గంలో కాంగ్రెస్ సభ జరుగుతోంటే... కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో అమిత్ షాను కలవటమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విషయంలో తన వైఖరేమిటో చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. లేకుంటే పార్టీ నుంచి బయటకు పోవాలని పరుష పదజాలంతో విమర్శించారు. దీంతో కోమటిరెడ్డి వర్గీయుల్లో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి చెలరేగాయి. అనంతరం కోమటిరెడ్డిపై వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన అనుచరులు అద్దంకి దయాకర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. దీంతో స్పందించిన అద్దంకి క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు.

    పార్టీకి నష్టం జరగొద్దనే ఆ వ్యాఖ్యలు చేశాను తప్ప... వెంకట్ రెడ్డిని విమర్శించాలని కాదన్నారు. తెలంగాణలో ఆ పదాన్ని కామన్ గా వాడుతారన్న ఆయన... తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Congress, Komatireddy venkat reddy, Munugodu By Election, Revanth Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు