హోమ్ /వార్తలు /తెలంగాణ /

Revanth Reddy | KCR: యూపీఏను చీల్చేందుకే కేసీఆర్​ కుట్ర: టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి

Revanth Reddy | KCR: యూపీఏను చీల్చేందుకే కేసీఆర్​ కుట్ర: టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి

కేసీఆర్, రాహుల్, రేవంత్ (ఫైల్ ఫోటో)

కేసీఆర్, రాహుల్, రేవంత్ (ఫైల్ ఫోటో)

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్​ఎస్​, బీజేపీలకు అభ్యర్థులను ప్రకటించే ధైర్యం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించడంతో హైదరాబాద్ గాంధీభవన్‌లో ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మునుగోడు ఉపఎన్నికలో (Munugodu By Elections) టీఆర్​ఎస్​, బీజేపీలకు అభ్యర్థులను ప్రకటించే ధైర్యం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (TPCC Chief Revanth Reddy) విమర్శించారు. కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించడంతో హైదరాబాద్ గాంధీభవన్‌లో ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు. ఇప్పటకే టికెట్ ఆశించిన ఆశావహులను రేవంత్ రెడ్డి బుజ్జగించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ బోస్‌ రాజు సహా ఇతర సీనియర్‌ నేతలు మునుగోడు ఉపఎన్నిక, పలు అంశాలపై చర్చించారు.

  రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP) అకారణంగా ఉప ఎన్నిక తెచ్చాయి. టీఆర్ఎస్ ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించలేని స్థితిలో ఉంది. కేసీఆర్​ను సంతోషపెట్టేందుకు ఆ పార్టీ నాయకులు జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లుంది. ఇక్కడ ఏం చేయలేని వాడు.. దేశ రాజకీయాల్లో వెళ్లి ఏం చేస్తారు. కాంగ్రెస్ను బలహీనపరిచేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న మాయావతి, నవీన్ పట్నాయక్తో కేసీఆర్ ఎందుకు చర్చలు జరపడం లేదు. బీజేపీకి మేలుచేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు. బీజేపీ , టీఆర్ఎస్ రెండు పార్టీలు బొమ్మా బొరుసు లాంటివి” అని అన్నారు.

  లిక్కర్​ స్కాంపై బుద్దిలేని ప్రచారం..

  ‘దేవుడు నిమజ్జనానికి వచ్చిన వ్యక్తి రాజకీయాలు మాట్లాడడం ఏంటి? అని రేవంత్​ మండిపడ్డారు. ఇదంతా టీఆర్ఎస్, బీజేపీ గేమ్ ప్లాన్ అని ఆరోపించారు రేవంత్​. వెస్ట్ బెంగాల్ ప్లాన్​ను బీజేపీ, టీఆర్ఎస్ అమలు చేస్తున్నాయని అన్నారు. లిక్కర్ స్కాంపై బీజేపీ బుద్దిలేని ప్రచారం చేస్తోందని కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు పదేపదే ఈ అంశంపై మాట్లాడుతున్నారని అన్నారు రేవంత్​. సూదిని సృజన్ ఎవరితో కలిసి వ్యాపారం చేస్తున్నారో విచారణ చేయండని  డిమాండ్​ చేశారు. ఆయనకు ఎవరితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో తీయండని కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఇంట్లో ఇప్పటి వరకు ఎందుకు సోదా చేయలేదని రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు.

  Telangana: రాజన్న బిడ్డవైతే మునుగోడులో పోటీ చెయ్​.. షర్మిలకు మంత్రి సవాల్​

  మునుగోడు ఉపఎన్నిక ప్రచార వ్యూహంలో భాగంగా పలువురు సీనియర్‌ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించినట్టు రేవంత్​ చెప్పారు. ఈ నెల 18 నుంచి ప్రచారం ప్రారంభిస్తామని... నల్లగొండ జిల్లా కు కేంద్ర ప్రభుత్వం వల్ల ఎటువంటి లాభం జరగలేదని రేవంత్‌ విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణకు ఒరిగింది శూన్యమని విమర్శించారు.

  కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ, టీఆర్ఎస్​లు కలిసి పనిచేస్తున్నాయని రేవంత్​రెడ్డి ఆరోపించారు . నరేంద్ర మోదీ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే తెలంగాణలో నిరుద్యోగం ఉండేది కాదన్నారు. ఉప్పు, పప్పు చివరకు పాలు, పెరుగుపై జీఎస్టీ వేశారని మండిపడ్డారు. మోదీ ఇచ్చిన హామీ ప్రకారం 16 కోట్ల ఉద్యోగాలు రావాల్సిందన్నారు. మోదీ ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో 50 లక్షలు రావాలని గుర్తుచేశారు. మునుగోడులో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదన్నారు రేవంత్​రెడ్డి .

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bjp, CM KCR, Munugodu By Election, Revanth Reddy, Telangana Politics, Trs, TS Congress

  ఉత్తమ కథలు