హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana politics : నేడు భేటీ కానున్న కేసీఆర్‌, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ..జాతీయ రాజకీయాలపైనే ప్రధాన చర్చ

Telangana politics : నేడు భేటీ కానున్న కేసీఆర్‌, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ..జాతీయ రాజకీయాలపైనే ప్రధాన చర్చ

kcr, kumaraswamy(file photo)

kcr, kumaraswamy(file photo)

KCR | Kumaraswamy: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్దమవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకు తగిన విధంగా వ్యూహ రచన, ఇతర పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఆదివారం హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి,జనతాదళ్ సెక్యులర్ పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామితో భేటీ కానున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్దమవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) అందుకు తగిన విధంగా వ్యూహ రచన, ఇతర పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. వారం రోజుల క్రితం బిహార్ సీఎం(Bihar CM)నితీష్‌కుమార్‌(Nitish Kumar)ని కలిసిన ఆయన ఆదివారం హైదరాబాద్‌(Hyderabad)లో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి(Karnataka former Chief Minister),జనతాదళ్ సెక్యులర్ పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy)తో భేటీ కానున్నారు. వీరిద్దరూ మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నారు. కేంద్రంలో ఎన్డీఏ (NDA) ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ పార్టీని ప్రకటించనున్నారు కేసీఆర్. దీనికి తోడుగా ఈ ఏడాది డిసెంబర్‌(December)లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు(Karnataka Assembly Elections)జరగనున్నాయి. ఈనేపథ్యంలోనే కేసీఆర్, కుమారస్వామి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Telangana politics : రాబోయే ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కేటీఆర్‌పై పోటీకి బంధువు రెడీ .. ఎవరో..? ఏ పార్టీ నుంచంటే

మాజీ సీఎంతో కేసీఆర్ భేటీ ..

ముఖ్యంగా కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీలో ప్రధానంగా జాతీయ రాజకీయాలపైనే చర్చ జరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఇదే నెలలో బిహార్ సీఎం నితీష్‌కుమార్‌ని కలిశారు కుమారస్వామి. వారిద్దరి భేటీలో కూడా జాతీయ రాజకీయాలపైనే చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇదే నెలలో జాతీయ పార్టీని కూడా హైదరాబాద్‌లో ప్రకటించాలని టీఆర్ఎస్‌ అధినేత భావించారు. ఇందుకోసం పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు అన్నీ వర్గాల నుంచి మద్దతును స్వీకరించారు. అయితే సెప్టెంబర్‌ 25న కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లే అవకాశముందని కూడా పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే జాతీయ పార్టీ పేరును ఈలోగా ప్రకటిస్తారా లేక ఢిల్లీ టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత ప్రకటిస్తారా అనే విషయంపై క్లారిటీ రాలేదు. మాజీ డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ దేవిలాల్‌ స్మారకార్థం, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ చీఫ్‌ ఓం ప్రకాశ్‌ చౌతాలా ఆధ్వర్యంలో సమ్మాన్‌ దివస్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్​ హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఉంది.

నేషనల్‌ పాలిటిక్స్‌పైనే గురి ..

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏను గద్దె దింపడమే లక్ష్యంగా కేసీఆర్‌ మలివిడత రాజకీయ పోరాటానికి సిద్ధపడినట్లుగా గులాబీ శ్రేణులు ఇప్పటికే ప్రకటించారు. అందుకోసం తగిన కార్యాచరణ, ఎన్డీయేతర పార్టీలతో సమావేశం వంటి అంశాలపై ఫోకస్ పెట్టారు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన కేసీఆర్‌ జాతీయ రాజకీయాల కోసం మరోసారి ఉద్యమాన్ని చేయడానికి సిద్దమైనట్లుగా సొంత పార్టీ నేతలు ప్రకటించడం జరిగింది.

Published by:Siva Nanduri
First published:

Tags: Hd kumaraswamy, Telangana Politics

ఉత్తమ కథలు