హోమ్ /వార్తలు /తెలంగాణ /

మునుగోడులో కలకలం..కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ను తగలబెట్టిన దుండగులు..టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం

మునుగోడులో కలకలం..కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ను తగలబెట్టిన దుండగులు..టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం

ట్విట్టర్, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ను తగలబెట్టిన దుండగులు,..టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం

ట్విట్టర్, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ను తగలబెట్టిన దుండగులు,..టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం

మునుగోడు బైపోల్ లో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఓ వైపు నామినేషన్లు మరోవైపు నాయకుల ప్రచారంతో మునుగోడులో సందడి నెలకొంది. ఈ క్రమంలో చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడు బైపోల్ లో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఓ వైపు నామినేషన్లు మరోవైపు నాయకుల ప్రచారంతో మునుగోడులో సందడి నెలకొంది. ఈ క్రమంలో చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో ప్రచారం కోసం ఉంచిన జెండాలు, పోస్టర్లు తగలబడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 లక్షల విలువైన ప్రచార సామాగ్రి తగలబడినట్లు తెలుస్తుంది. దీనితో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చండూరులో ధర్నాకు దిగారు.ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసే ఈ పనికి పాల్పడ్డారని, వారిపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆఫీస్ ను తగలబెట్టిన కూల్చి వేసిన మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. మా కేడర్ ను బెదిరించాలని బీజేపీ, టీఆర్.ఎస్ ప్రయత్నిస్తుందని రేవంత్ ఆరోపించారు.

మరోవైపు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కానీ నామినేషన్ సమర్పించిన గంటల వ్యవధిలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్ తగిలింది. మునుగోడు Munugodu నియోజకవర్గంలోని చండూరులో పోస్టర్లు కలకలం రేపాయి. ఈ పోస్టర్లు రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిశాయి. ఫోన్ పే తరహాలో కాంట్రాక్టు పే అంటూ 18 వేల కోట్ల కాంట్రాక్టు రాజగోపాల్ రెడ్డికి కేటాయించడం జరిగిందని పోస్టర్లో పేర్కొన్నారు. అంతేకాదు BJP18THOUSANDCRORES అంటూ ట్రాన్సక్షన్ ఐడీని ఉంచారు. అలాగే 500 కోట్ల బోనస్ అంటూ ఫోన్ పే ట్రాన్సక్షన్ తరహాలో కాంట్రాక్టు పేరుతో వేలాది పోస్టర్లు రాత్రికి రాత్రే వెలిశాయి. ఈ పోస్టర్లు ఎవరు అంటించారనేది తెలియరాలేదు. రాత్రికి రాత్రే పోస్టర్లను టీఆర్ఎస్ నాయకులైన, లేకకాంగ్రెస్ నాయకులైన అంటించి ఉంటారని కోమటిరెడ్డి వర్గం చెబుతుంది.

ఈ రెండు ఘటనలతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కాంగ్రెస్ కు వచ్చే ఆదరణ చూడలేకే టిఆర్ఎస్, బీజేపీ ఈ దారుణానికి పాల్పడ్డాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరోవైపు రాత్రికి రాత్రే పోస్టర్లు వెలవడం వెనక కాంగ్రెస్, టిఆర్ఎస్ హస్తం ఉందని బీజేపీ విమర్శిస్తోంది. మరి ఈ రెండు ఘటనలు బీజేపీ, కాంగ్రెస్ అప్రమత్తం అయ్యాయి. మునుగోడుకు Munugodu ఉపఎన్నికకు 20 రోజులు ఉన్న క్రమంలో ఇంకా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

First published:

Tags: Munugodu By Election, Telangana

ఉత్తమ కథలు