Home /News /telangana /

TS POLITICS THUGS KILLED TRS LEADER KRISHNAIAH FOLLOWER OF FORMER MINISTER TUMMALA NAGESWARA RAO IN KHAMMAM DISTRICT SNR KMM

Murder : మాజీ మంత్రి తుమ్మల అనుచరుడ్ని వేటాడి చంపిన దుండగులు .. అందరి అనుమానం అతనిపైనే

khammam murder

khammam murder

Murder: ఖమ్మం జిల్లాలో వేట కొడవళ్ల పదునుకు మరో రాజకీయ బలయ్యాడు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్యను అతి దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. రాజకీయ ఆధిపత్యంతోనే ఈహత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Khammam, India
    (G.SrinivasReddy,News18,Khammam)
    ఖమ్మం(Khammam)జిల్లాలో వేట కొడవళ్ల పదునుకు మరో రాజకీయ బలయ్యాడు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao)ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య(Krishnaiah)ను అతి దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. రాజకీయంగా ఎదుగుతున్న కృష్ణయ్యను రాజకీయ కక్షలతో ప్రత్యర్ధులు హతమార్చినట్లుగా తెలుస్తోంది. కృష్ణయ్య హత్యతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణయ్య హత్యకు కారకుడిగా అనుమానిస్తూ సీపీఎం నాయకులు తమ్మినేని కోటేశ్వరరావు(Tammineni Koteswara Rao)ఇంటిపై దాడికి దిగడంతో పోలీసులు(Police)బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

    BJP VS TRS : బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్రలో ఘర్షణ .. రాళ్ల దాడిలో గాయపడ్డ బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు



    రాజకీయ విభేదాలే కారణమా..?
    స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఖమ్మం జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. కేవలం రాజకీయ పగలు, ప్రతీకారాలను దృష్టిలో పెట్టుకొని ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో టీఆర్ఎస్‌ నాయకుడు, జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్యను గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లు, కత్తులతో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా పొన్నెకల్ రైతు వేదిక దగ్గర జాతీయ జెండా ఎగురవేసి తిరిగి తెల్దారుపల్లికి బైక్‌పై వస్తుండగా గ్రామ సమీపంలోకి రాగానే దుండగులు ఆటోతో ఢీకొట్టారు. అనంతరం ఆరుగురు కృష్ణయ్యపై వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చారు. తెల్దారుపల్లి శివారులోని రోడ్డుపై ఈ ఘటన జరిగింది. కృష్ణయ్య ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన భార్య ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. కృష్ణయ్య హత్య రాజకీయ కోణంలో జరిగిందా లేక పాత కక్షల మూలంగా జరిగిందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.



    వేటకొడవళ్లు, కత్తులతో నరికి...
    అధికార పార్టీకి చెందిన నాయకుడు, మాజీ మంత్రి అనుచరుడిని హతమార్చడం స్థానికంగా సంచలనం రేపుతోంది. అయితే కృష్ణయ్య హత్యకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు కారణమని తెల్దారుపల్లికి చెందిన పలువురు గ్రామస్తులు ఆరోపించారు. కోటేశ్వరరావు ఇల్లు, గెస్ట్‌ హౌస్‌పై వారంతా దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో తమ్మినేని కోటేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు పోలీసులు.

    Crime news : జెండా పండుగకు వెళ్లి వస్తున్న భార్య పీక కోసి చంపిన భర్త ... కారణం తెలిస్తే షాక్ అవుతారు



    ఏ క్షణనా ఏం జరుగుతుందో ..
    గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు కోటేశ్వరరావు ఇంటి దగ్గర భారీ పోలీసు బందోబస్తు పెట్టారు. రాజకీయ ఆధిపత్యం కోసం హత్య చేశారా లేక పగ కక్షలను దృష్టిలో పెట్టుకొని రివేంజ్ తీర్చుకున్నారా అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఇరువర్గాలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Khammam, Murder, Telangana crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు