(P.Srinivas,New18,Karimnagar)
రాజ్యసభ ఎన్నికల(Parliament election)పై తెలంగాణ(Telangana)లో హాట్ హాట్ టాపిక్ నడుస్తోంది. జిల్లా వారిగా ఎంపీ పదవికి అర్హత ఉన్నవాళ్లతో పాటు ఆశావాహుల జాబితా రోజు రోజుకు పెరుగోతోంది. ముఖ్యంగా కరీంనగర్Karimnagar జిల్లాలో ఈసారి ముగ్గురు పేర్లు బాగా వినిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి కెప్టెన్ లక్షీకాంతరావు(Captain Lakshikantarao), ధర్మపురి శ్రీనివాస్(Dharmapuri Srinivas)రాజ్యసభ నుంచి రిటైర్డ్ కాబోతున్నారు. ఇద్దరిలో కెప్టెన్ లక్ష్మీకాంతరావుది కరీంనగ్ జిల్లా హుజురాబాద్(Huzurabad)మండలం సింగాపురం. సీఎం కేసీఆర్(Kcr)కు అత్యంత సన్నిహితులు . కేసీఆర్ హన్మకొండలో అడుగుపెట్టారంటే బాలసముద్రంలోని కెప్టెన్ ఇంటికి వెళ్తారు. 2004 లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ (Trs)నుంచి గెలుపొంది అప్పుడు కాంగ్రెస్(Congress) తో పొత్తుపై పోటీ చేయడంతో పొత్తులో భాగంగా కెప్టెన్‌కి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి(BC Welfare Minister)గా పనిచేసే అవకాశం వచ్చింది. 2009 లో నియోజవర్గాల పునర్విభజన అనంతరం కెప్టెన్ ఎమ్మెల్యేకు పోటీ చేయలేదు. దాంతో సీఎం కేసీఆర్ రాజ్యసభకు అవకాశం కల్పించారు. అదే పోస్ట్‌ని అప్పటికి కెప్టెన్ లక్ష్మికాంతరావుకు కొనసాగిస్తూ వస్తున్నారు. మరి ఈసారి అదే సెంటిమెంట్ కొనసాగిస్తారా లేక ఆయన ప్లేస్‌లో కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా అనేది సీఎం నిర్ణయంపై ఆధారపడి ఉంది.
పెద్దల సభకు ముగ్గురు సీనియర్లు..
సీఎం నిర్ణయం సంగతి పక్కనపెడితే కెప్టెన్ హెల్త్, వయసురిత్య కొత్తవారికే ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కొత్తగా కేటాయించే అభ్యర్దిని సీఎం డిసైడ్ చేస్తారా లేక కెప్టెన్ సిఫార్సు చేసిన వ్యక్తికి కట్టబెడతారా అనే చర్చ నడుస్తోంది. మాజీ ఎంపీ బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఎన్నికయ్యే అభ్యర్ది పదవీకాలం 2024 ఏప్రిల్ వరకు ఉంటుంది . ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ 12 న ప్రారంభమైంది 19 వరకు ఉంటుంది . 20 న నామినేష న్లను పరిశీలిస్తారు. ఉపసంహరణ గడు 23 వరకు ఉంటుంది , ఎన్నిక ఈ నెల 30 న ఉంటుంది . ప్రతిపక్షాల కు మెజారిటీ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది . అయితే సీఎం కేసీఆర్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు . నేడో రేపో బండ ప్రకాశ్ స్థానంలో ఎవరి కి అవకాశం ఇస్తారన్నది తేలుతుంది. ఈ రెండు స్థానాల్లో ఒకటి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తారనే ప్రచారం జరుగుతుంది.
అందరూ ఆయనకు ఆత్మీయులే..
అదే జరిగితే కెప్టెన్ లక్ష్మీకాంతరావు చేయనంటే ఆ స్థానంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్‌కి లేదా మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఎంపీగా పోటీ చేసి బండి సంజయ్ మీద ఓడినా వినోద్ కుమార్‌కు ఓడిన తర్వాత ప్రణాళికసంఘం వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టారు కేసీఆర్. హుజురాబాద్ ఎన్నికల సమయంలో బిజెపి నుండి టీఆర్ఎస్లోకి వచ్చిన పెద్దిరెడ్డి కి అప్పుడు పోటీ చేయడానికి టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఈసారి తనను రాజ్యసభకు ఎంపిక చేస్తారనే చిన్న ఆశ ఆయనలో కనిపిస్తోంది.
అవకాశం ఎవరికి దక్కేనో..
జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుకు ఈమధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి నారదాసు సైతం ఈసారి రాజ్యసభ సీటుపై కన్నేశారని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. ఈ ముగ్గురు నేతల్లో ఎవరికి సీఎం అకాశమిస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Elections, Karimangar, Parliament