హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana:ప్రత్యర్ధులు ఏం చేసినా కేసీఆర్‌కి తిరుగులేదట..ఆయన తీసుకునే సాహసోపేత నిర్ణయం ఏంటో తెలుసా

Telangana:ప్రత్యర్ధులు ఏం చేసినా కేసీఆర్‌కి తిరుగులేదట..ఆయన తీసుకునే సాహసోపేత నిర్ణయం ఏంటో తెలుసా

Telangana Panchangam: శుభకృత్ నామ సంవత్సరం తెలంగాణ ప్రజలకు అద్బుతంగా ఉంటుంది. సీఎం కేసీఆర్‌కి గతేడాది కంటే ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుందని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారని పంచాంగ పఠనంలో సంతోష్‌కుమార్ శాస్త్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు, విద్యా, ఆరోగ్యపరంగా ఎలాంటి అవాంతరాలు ఉండవన్నారు. ఇక పార్టీలు మారాలనుకునే వాళ్లకు గడ్డుకాలం తప్పదని పంచాంగంలో ఉన్నట్లు తెలిపారు.

ఇంకా చదవండి ...

తెలంగాణ రాష్ట్రానికి, పాలించే పాలకులకు, రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఈ శుభకృత్ నామ సంవత్సరం ఎంతో అద్భుతంగా ఉంటుందని ఉగాది పంచాంగంలో ఉన్నట్లుగా సెలవిచ్చారు బాచుపల్లి సంతోష్‌కుమార్‌శాస్త్రి  (Bachupally Santosh kumarshastri). ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR )ఈ ఏడాదిలో సాహసోపేతమైన నిర్ణయాలు ప్రకటిస్తారని చెప్పారు. ఆయనకున్న చెడు కాలం ఫిబ్రవరి (February27)తో తొలగిపోయిందని..ప్రత్యర్ధులు ఇబ్బందులు పెట్టినప్పటికీ, అడ్డంకులు సృష్టించాలని చూసిన ఏమాత్రం వెనక్కి తగ్గరని పంచాంగ పఠనంలో ఉన్నట్లు సంతోష్‌కుమార్‌ శాస్త్రీ చెప్పారు. కేసీఆర్‌ది కర్కాటక రాశి అని...సీఎం జాతకం గత సంవత్సరం కంటే బాగుంటుందని తెలిపారు. హైదరాబాద్ (HYDERABAD)నగరం ప్రపంచాన్ని శాసించే విధంగా ఎదుగుతుందని ..మరీ ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ రంగం (Real estate sector)ఒక్క హైదరాబాద్‌లోనే బాగా అభివృద్ధిపథంలో దూసుకెళ్తుందన్నారు. అంతే కాదు కొందరు నాయకులకు పదవి మార్పులు కలుగుతాయని..అందువల్ల పార్టీలు మారాలనుకునే వాళ్లకు గడ్డు కాలం తప్పదని పంచాంగ పఠనం ద్వారా హెచ్చరించారు.ఏడాది మొత్తంగా చూసుకుంటే 75శాతం మంచి జరుగతుందని 25శాతం వ్యతిరేకంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో వర్షాలు బాగా పడి పంటలు అద్భుతంగా పండుతాయన్నారు. ఆశ్యీయుజ మాసంలో తుఫానులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలని పంచాంగంలో ఉన్నట్లు వివరించారు.

కేసీఆర్‌కి ఏడాది తిరుగుండదట..

తృతీయాధిపతి రవి రాజ్యస్థానంలో ఉండట వల్ల తెలంగాణలో ప్రజా ఆరోగ్యం చక్కగా ఉంటుంది.  మాస్కులు, టెస్ట్‌లతో పని ఉండదన్నారు. ఈ ఏడాది శుభకృత్ నామ సంవత్సరం కాదని ఉద్యోగనామ సంవత్సరం అని పంచాంగంలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. తెలంగాణలోని నిరుద్యోగులకు ఈ ఏఢాది శుభ ఏడాదిగా ఉందన్నారు. విద్యా విధానంలో నూతన విధానాలు వస్తాయని..ఆన్‌లైన్‌ విద్యతో పని ఉండదన్నారు.

(ప్రగతిభవన్‌లో ఉగాది వేడుకలు)

సాహసోపేతమై ప్రకటన ఉంటుంది..

ముఖ్య నేతలకు భద్రత పెరుగుతుందని, దేశంలో అలజడులు ఉంటాయని శాస్త్రి పేర్కొన్నారు. దేశంలో మధ్యప్రదేశ్‌తో పాటు మరికొన్ని చోట్ల రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు పొదుపు పాటించకపోతే శ్రీలంక పరిస్థితి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బాచుపల్లి సంతోష్ కుమార్‌ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు.

First published:

Tags: CM KCR, Telangana

ఉత్తమ కథలు