హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu Bypoll: వారు ఇంకా మునుగోడులోనే ఉన్నారు..అర్ధరాత్రి చండూరు ఆర్వో ఆఫీస్ ఎదుట రాజగోపాల్ రెడ్డి ధర్నా

Munugodu Bypoll: వారు ఇంకా మునుగోడులోనే ఉన్నారు..అర్ధరాత్రి చండూరు ఆర్వో ఆఫీస్ ఎదుట రాజగోపాల్ రెడ్డి ధర్నా

రాజగోపాల్ రెడ్డి

రాజగోపాల్ రెడ్డి

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం అర్ధరాత్రి మెరుపు ధర్నాకు దిగారు. ఎన్నికల నియమావళికి విరుద్దంగా పలువురు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యకర్తలు నియోజకవర్గంలోనే ఉన్నారు. అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని చండూరు ఆర్వో కార్యాలయం వద్ద కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy rajagopal reddy) బుధవారం అర్ధరాత్రి మెరుపు ధర్నాకు దిగారు. ఎన్నికల నియమావళికి విరుద్దంగా పలువురు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యకర్తలు నియోజకవర్గంలోనే ఉన్నారు. అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని చండూరు ఆర్వో కార్యాలయం వద్ద కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy rajagopal reddy) మాట్లాడుతూ..బీజేపీ నాయకులపై పోలీసులు వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. పలువురు తెరాస నేతలు ఇంకా నియోజకవర్గంలో తిరుగుతూ..డబ్బులు పంచుతున్నారు. ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి (Komatireddy rajagopal reddy) కి సంబంధించిన మనుషులు ఎవరు బయటకు రావద్దని బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రాజగోపాల్ (Komatireddy rajagopal reddy) డిమాండ్ చేశారు.

Munugode Bypoll: అందరి కళ్లు మునుగోడు పైనే.. కాసేపట్లో పోలింగ్ ప్రారంభం

అనంతరం జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరితో రాజగోపాల్ రెడ్డి (Komatireddy rajagopal reddy) ఫోన్ లో మాట్లాడారు. స్థానికేతర టీఆర్ఎస్ నాయకులను బయటకు పంపించాలని రాజగోపాల్ రెడ్డి (Komatireddy rajagopal reddy) . ఆర్వో కార్యాలయానికి వచ్చిన ఏఆర్వోను ప్రశ్నించగా అతని నుండి సరైన స్పందన రాలేదు. దీనితో చండూరు ఆర్వో కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ కు భారీ ర్యాలీగా వెళ్లారు. స్థానికేతరులను బయటకు పంపించాలని అప్పటివరకు ధర్నా కొనసాగిస్తామని భీష్మించుకు కూర్చున్నారు. బయట నుంచి వచ్చిన వారిని మునుగోడు నుండి ఖాళీ చేయిస్తామని పొలిసులు హామీ ఇవ్వడంతో రాజగోపాల్ రెడ్డి (Komatireddy rajagopal reddy) ఆందోళన విరమించారు.

First published:

Tags: Komatireddy rajagopal reddy, Munugodu By Election, Telangana

ఉత్తమ కథలు