హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: కరీంనగర్​లో ఆసక్తికరంగా రాజకీయాలు.. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఎన్​ఆర్​ఐ లీడర్స్​ వీళ్లే..

Karimnagar: కరీంనగర్​లో ఆసక్తికరంగా రాజకీయాలు.. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఎన్​ఆర్​ఐ లీడర్స్​ వీళ్లే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అన్ని పార్టీల్లోనూ ఆశావహులు ఎక్కువే .. కొత్తవారు కొందరైతే .. రాజకీయ వారుసులు మరికొంత మంది.  విదేశాల్లో స్థిరపడి ఇండియాకు చేరినవారిలో కొంతమంది చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (Srinivas. P. News18, Karimnagar)

  అన్ని పార్టీల్లోనూ ఆశావహులు ఎక్కువే .. కొత్తవారు కొందరైతే .. రాజకీయ వారుసులు మరికొంత మంది.  విదేశాల్లో స్థిరపడి ఇండియాకు చేరినవారిలో కొంతమంది చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.. వివిధ పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్నారు  ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఎన్​ఆర్​ఐ (NRI)లు ప్రజా క్షేత్రంలో తమ భవిష్యత్తును తేల్చుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు . ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో ఇద్దరు  అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 నుంచి వీరిద్దరు ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు . సిరిసిల్ల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) కాగా మరొకరు వేములవాడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నమనేని రమేష్ బాబు .

  అమెరికాలో స్థిరపడిన కేటీఆర్ (KTR) ఉద్యమ సమయంలో ఇండియాకు వచ్చి రాజకీయ రంగ ప్రవేశం చేసి శాసనసభకు ఎన్నికయ్యారు . చెన్నమనేని రమేష్ బాబు (Chennamaneni Ramesh babu) జర్మనీలో స్థిరపడినా తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు . తండ్రి చెన్నమనేని రాజేశ్వరరావు వారసత్వంతో పాటు జర్మనీ స్వచ్చంద సంస్థ సేవ్స్ ద్వారా అందించిన సేవలను ఆసరాగా చేసుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు . మొదట టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్ బాబు ప్రస్తుతం టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు . గతంలో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన సీహెచ్ సుగుణా కుమారి(Suguna Kumari) కూడా దుబాయిలో వైద్య వృత్తిలో స్థిరపడి మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చారు . పెద్దపల్లి  (Peddapalii) ఎంపీగా రెండు సార్లు గెలిచి సంచలనం సృష్టించారు . 

  ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లా నుంచి టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వృత్తి రీత్యా వివిధ దేశాల్లో స్థిరపడి ఇంటికి చేరిన ఎన్​ఆర్​ఐ (NRI) లు ఆయా పార్టీల అండదండలతో తమ భవితవ్యం తేల్చుకోవాలని భావిస్తున్నారు . ప్రజా క్షేత్రంలో తమ భవితను పరీక్షించుకునేందుకు  ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు . జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి టీఆర్ఎస్ పార్టీ  (TRS party)తరుపున పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ సంజయ్ ప్రయత్నిస్తున్నారు . సంజయ్ గతంలో ఆస్ట్రేలియా , సింగపూర్ దేశాల్లో ఉన్నారు . అలాగే బీజేపీ నుంచి సురభి నవీన్ రావు (S Naveen rao) లండన్ కు వెళ్ళి ఇండియాకు తిరిగొచ్చారు . ఇటీవలే బీజేపీలో(BJP) చేరిన నవీన్ రావు కోరుట్ల టికెట్ ఆశిస్తున్నారు .

  Khammam: “దేవుడే దారి చూపిస్తాడు.. ఉరికి ఉరికి బోర్లా పడాల్సిన అవసరం లేదు: మాజీ ఎంపీ పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు..

  కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఎం రోహిత్ రావు (M Rohit Rao) ఆస్ట్రేలియా నుంచి స్వస్థలానికి చేరుకున్నారు . సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దివంగత ఎమ్మెస్సార్ మనవడు అయిన రోహిత్ రావు వచ్చే ఎన్నికల్లో తాత వారసత్వంతో చట్ట సభలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు . పెద్దపల్లి నుంచి బరిలో నిలిచేందుకు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి (Suresh reddy) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు . అమెరికాలో స్థిరపడి ఇండియాకు వచ్చిన ఆయన తన పెద్దనాన్న రాజారెడ్డి వారసత్వంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు . గత ఎన్నికలకు ముందు కూడా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు . ఈ సారి మాత్రం బీజేపీలో చేరిన సురేష్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సుకత చూపుతున్నారు .

  పెద్దపల్లి టీఆర్ఎస్ టికెట్ (Peddapalli TRS Ticket) ఆశిస్తున్న నల్ల మనోహర్ రెడ్డి (N Manohar Reddy) కూడా ఎన్ఆర్ఐ కావడం విశేషం . 2009 లో జూలపల్లి సింగిల్ విండో చైర్మన్ గా చేసిన ఆయన అదే సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు . 2014 , 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం ఆయనకు ఇవ్వలేదు . ఈ సారి తనకే టికెట్ దక్కాలని ఆశిస్తున్న నల్ల మనోహర్ రెడ్డి లండన్ లో స్థిరపడి స్వస్థలానికి చేరుకున్నారు.

  మంథని బీజేపీ టికెట్ ఆశిస్తున్న చంద్రుపట్ట సునీల్ రెడ్డి (Sunil Reddy) కూడా గతంలో అమెరికాలో స్థిరపడి ఇండియాకు తిరిగొచ్చారు. 2009 లో టీడీపీ టికెట్ ఆశించిన ఆయన చివరి క్షణంలో అధిష్టానం వేరే వారికి బీ ఫాం ఇవ్వడంతో ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు . తరువాత టీఆర్ఎస్  (TRS) లో చేరిన సునీల్ రెడ్డి 2014 లో టికెట్ రాకపోవడంతో మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు   2018 లో కేటీఆర్ (KTR) మధ్యవర్తిత్వం కారణంగా పోటీ చేయకుండా టీఆర్ఎస్ అభ్యర్థి కోసం ప్రచారం చేశారు . తరువాత సాంకేతిక సలహాదారు పోస్టు ఇస్తానని మాట ఇచ్చిన కేటీఆర్ చేతల్లో చూపక పోవడంతో గత సంవత్సరం టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు . ప్రస్తుతం బీజేపీలో ఉన్న సునీల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు . తండ్రి మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి వారసునిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు .ఇలా ఎవరికీ వారే వచ్చే ఎన్నికలో పోటీకి సిద్ధం అవుతున్నారు..

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Assembly Election 2022, Karimnagar

  ఉత్తమ కథలు