Home /News /telangana /

TS POLITICS THESE ARE THE SEATS THAT THE TRS PARTY WILL GET IN THE UPCOMING TELANGANA ASSEMBLY ELECTIONS ACCORDING TO BANDI SANJAY ASSUMPTION PRV

Telangana: బండి సంజయ్​ లెక్క.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRS​ కు ఎన్ని స్థానాలు వస్తాయంటే.. ?

బండి సంజయ్, కేసీఆర్

బండి సంజయ్, కేసీఆర్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ఆయా పార్టీలు ఇప్పటినుంచే ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధినేత బండి సంజయ్​ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​కు ఎన్ని సీట్లు వస్తాయనేది చెప్పేశారు.

    నల్గొండ (Nalgonda) జిల్లాలోని మునుగోడులో ఉపఎన్నిక రావాలని టీఆర్ఎస్ (TRS) పార్టీ కోరుకుంటుంటే.. కాంగ్రెస్ మాత్రం రావొద్దని కోరుకుంటుందని బీజేపీ తెలంగాణ చీఫ్​ బండి సంజయ్ (BJP Telangana chief Bandi Sanjay)అన్నారు. శనివారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన బండి సంజయ్.. పలు అంశాలపై స్పందించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని, పాతబస్తీలోనూ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ లో కేసీఆర్ (KCR) పై పోటీ చేసి ఓడిస్తానని ఈటల రాజేందర్ ఛాలెంజ్ చేయడంపై బండి సంజయ్ స్పందించారు. ఎవరైనా ఎక్కడి నుండైనా పోటీ చేస్తామని చెప్పే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ విషయంలో తుది నిర్ణయం అధిష్టానానిదేనని స్పష్టం చేశారు. తనతో సహా ఎవరు ఎక్కడి నుండి పోటీ చేయాలనేది ఫైనల్ చేయాల్సింది మాత్రం హైకమాండేనని చెప్పారు. పార్టీ ఎవరిని ఎక్కడి నుండి పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడి నుండి పోటీ చేయాల్సిందేనని అన్నారు.

    టీఆర్ఎస్ పార్టీకి (TRS) రోజులు దగ్గర పడ్డాయని ఇకపై తెలంగాణ (Telangana)లో గులాబీ పార్టీ ఆటలు సాగవని అన్నారు. ఇన్నాళ్లూ కేసీఆర్ బెదిరింపులకు భయపడి వ్యాపారస్తులు, ఇతర వర్గాలు అణిగిమణిగి ఉన్నాయని, ఇకపై కేసీఆర్ ఆటలు చెల్లవని చెప్పారు. రాష్ట్రం భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంటే కల్వకుంట్ల కుటుంబం ఎటు పోయిందని విమర్శించారు. తెలంగాణలో ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ (TRS) కు 15 స్థానాలకంటే ఎక్కువ రావని అన్నారు.



    అప్పుడు ప్రగతిభవన్​.. ఇప్పుడు ఢిల్లీ..

    మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union  Minister Kishan reddy) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం హైదరాబాద్‌లో మూసి వరదను పరిశీలించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వరదలు (Floods) వచ్చినప్పుడు కేసీఆర్ (KCR) ప్రగతి భవన్‌లో ఉండిపోయారని మండిపడ్డారు. ఈ ఏడాది వరదలు వస్తే సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారని విమర్శించారు. ఢిల్లీలో కేసీఆర్ (KCR) నాలుగు రోజులు ఏం చేస్తున్నారో తెలియదన్నారు. రాష్ట్రంలో ప్రజలు వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ ఢిల్లీలో (Delhi) ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

    Floating solar power project on water: తెలంగాణలో నీటిపై తేలియాడే సోలార్​ ప్రాజెక్టు.. ప్రారంభించిన ప్రధాని మోదీ.. పూర్తి  వివరాలివే

    కేసీఆర్ కుటుంబ పాలనకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయని అన్నారు. కొడుకు మీద వాత్సల్యంతో కేంద్రంపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం కోరుతున్న ఎస్‌డీఆర్ఎఫ్ (SDRF) నిధులకు ఆడిట్ లేదని విమర్శించారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులపై కేటీఆర్ (KTR) అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. వరదలతో నష్టపోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bandi sanjay, Telangana Assembly, Telangana bjp, Telangana Politics, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు