హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: కోర్టుకెక్కిన ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బండి సంజయ్​.. వివరాలివే

Hyderabad: కోర్టుకెక్కిన ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బండి సంజయ్​.. వివరాలివే

ఎమ్మెల్సీ కవిత, బండి సంజయ్​ (ఫైల్)

ఎమ్మెల్సీ కవిత, బండి సంజయ్​ (ఫైల్)

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​, కేసీఆర్​ కుమార్తె ఎమ్మెల్సీ కవిత వేరు వేరు కారణాలతో కోర్టులో కేసులు వేశారు. ఆ కేసులపై నేడు కీలక అప్​డేట్స్​ వచ్చాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ (Telangana) బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (BJP Chief Bandi sanjay)​, కేసీఆర్​ కుమార్తె ఎమ్మెల్సీ కవిత (MLC kavita) వేరు వేరు కారణాలతో కోర్టులో కేసులు వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి తనపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మజీందర్ సిర్సాలు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టు (Court)ను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇంజెక్షప్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ మద్యం పాలసీలో తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగించే ప్రకటనలు చేశారని.. బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు కవిత.


  అయితే ఈ కేసులో ఆమెకు ఊరట లభించింది. కవిత పిటిషన్‌పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు (City Civil Court) మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజిందర్ సిర్సాలకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీచేసింది. సభలలో, మీడియాలో, సోషల్ మీడియాలో కూడా నిరధారమైన ఆరోపణలు చేయవద్దని సూచించింది. కవిత దాఖలు చేసిన పరువు నష్టం దావాపై తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది.  యాత్రను నిలిపివేయాలని..


  ఇక బండి సంజయ్​ విషయానికొస్తే.. ప్రజా సంగ్రామ యాత్రను (Praja Sangrama yatra) నిలిపివేయాలని వర్ధన్నపేట పోలీసులు నిన్న నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్ర విషయమై బీజేపీ నేతలు తెలంగాణ హైకోర్టులో ఈ నెల 23న సాయంత్రం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ పై రేపు ఉదయం విచారణ చేస్తామని తెలంగాణ హైకోర్టు (High court) తెలిపింది. 6 రోజుల యాత్రలో 22 రోజుల పాటు యాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేని విషయాన్ని బీజేపీ తరపున న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.


  బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో విద్వేషపూరితంగా ప్రసంగాలు చేస్తున్నారని ప్రభుత్వ తరపున న్యాయవాది ఈ సందర్భంగా  కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.  ఇటీవల నమోదైన కేసులను కూడా హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు ప్రభుత్వ తరపు న్యాయవాది .


  Politics: పెళ్లిళ్లే ‘‘రాజకీయ వేదికలు’’.. బడా నేతల ఇళ్లల్లో మోగిపోతున్న బాజాలు


  ప్రభుత్వ వాదనను బీజేపీ తరపు న్యాయవాది తోసిపుచ్చారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనల ఆధారంగా యాత్రను నిలిపివేయడం సరైంది కాదని బీజేపీ తరపు న్యాయవాదులు వాదించారు. దీంతో ఈ పిటిషన్ పై రేపు ఉదయమే విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bandi sanjay, Courts, Hyderabad, Kalvakuntla Kavitha

  ఉత్తమ కథలు