హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS Party: కరీంనగర్​లో అధికార టీఆర్​ఎస్​కు షాక్​.. రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని పార్టీకి రాజీనామాలు..

TRS Party: కరీంనగర్​లో అధికార టీఆర్​ఎస్​కు షాక్​.. రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని పార్టీకి రాజీనామాలు..

ఈటల రాజేందర్​ లాంటి సీనియర్​ టీఆర్ఎస్​ నేతలు కూడా బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. వారు అంటున్నట్లుగానే ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇపుడు కరీంనగర్లో మరో షాక్​ తగిలింది.

ఈటల రాజేందర్​ లాంటి సీనియర్​ టీఆర్ఎస్​ నేతలు కూడా బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. వారు అంటున్నట్లుగానే ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇపుడు కరీంనగర్లో మరో షాక్​ తగిలింది.

ఈటల రాజేందర్​ లాంటి సీనియర్​ టీఆర్ఎస్​ నేతలు కూడా బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. వారు అంటున్నట్లుగానే ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇపుడు కరీంనగర్లో మరో షాక్​ తగిలింది.

  ( న్యూస్ 18, తెలుగు కరస్పాండెంట్​, శ్రీనివాస్. పి)

  తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇతర పార్టీల నుంచి అధికార టీఆర్ఎస్​ పార్టీ (TRS Party)లోకి వలసలు కొనసాగాయి. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఇతరపార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొందరు నాయకులు టీఆర్ఎస్ (TRS Party) ను వీడగా ఇంకా చాలామంది టీఆర్ఎస్ ను వీడటానికి సిద్దంగా వున్నట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈటల రాజేందర్​ లాంటి సీనియర్​ టీఆర్ఎస్​ నేతలు కూడా బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. వారు అంటున్నట్లుగానే ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరగా తాజాగా జగిత్యాల జిల్లాలో ఓ జడ్పిటీసీ టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా రైతులకు ఇచ్చిన హామీలు తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చలేదని కరీంనగర్ (Karimnagar)​ మెట్‌పల్లి జెడ్పీటీసీ (Metpally ZPTC) కాటిపెళ్లి రాధ, ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డిలు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

  రైతులకు మద్దతుగా..

  యాసంగి వడ్లు కొనుగోలు (Paddy procurement) హామీ, ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేయిస్తానని ఇచ్చిన హామీని ప్రభుత్వం మర్చిపోయిందని.. ఈ విషయంపై ప్రజలు తమను నిలదీస్తున్నారని జెడ్పీటీసీ (ZPTC)పేర్కొన్నారు. ఈ విషయాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దృష్టికి తీసుకెళ్లగా.. ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ (Resignation to TRS party)కి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే జెడ్పీటీసీ పదవికి కూడా రాజీనామా చేస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ (CM KCR)కు తమ రాజీనామా లేఖను ఫాక్స్ ద్వారా పంపామని వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా నిధులు లేక అరకొర వసతులతో గ్రామ పంచాయతీ పాలకవర్గ కూడా చాలాచోట్ల టిఆర్ఎస్ సర్పంచ్లు అలాగే ఎంపిటీసీ లు రాజీనామా చేసిన సంగతి అందరికి తెలిసిందే, ఇప్పుడు జెడ్ పి టి సి ల వంతు వచ్చిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  జెడ్పీటీసీ దంపతులు

  అభివృద్ధికి ఆమడ దూరంలో..

  టీఆర్ఎస్ (TRS) పరిపాలనలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని, ఇప్పటికే  ప్రతిపక్షాల విమర్శలు పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. టీఆర్ఎస్ నాయకులు అంతా అభివృద్ధి జపం మరిచి రియల్ ఎస్టేట్, సెటిల్మెంట్లకు దిగుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.  గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని వారు వాపోతున్నారు. ఇలాగే ప్రవర్తిస్తే టీఆర్ఎస్ పార్టీకి 2023 లో పుట్టగతులు ఉండవని. అలాగే ఇంకా కొంతమంది జడ్పీటీసీలు ఎంపీటీసీలు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు.  ఏదైనా విమర్శలు వస్తే పదవికి రాజీనామా చేయడం తప్ప, అభివృద్ధి పనులు జరగలేదని మొట్టమొదటిసారిగా జెడ్పిటీసి పదవికి రాజీనామా చేసిన మెట్పల్లి జెడ్పీటీసీ కాటేపల్లి రాధ, శ్రీనివాస్ రెడ్డి, లను  పలువురు నాయకులు అభినందిస్తున్నారు.

  ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్ల కొనుగోలు విషయంలో మీనమేషాలు వేస్తున్నారని ఎవరు కూడా క్లారిటీ ఇవ్వకుండా రైతులను అరిగోస పెడుతున్నారరని అసంతృప్తిలో ఉన్నారు. ఇన్ని రోజులు అవుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  వడ్ల కొనుగోలు పై క్లారిటీ ఇవ్వకపోగా ఒకరిపై ఒకరు ధర్నాలు, నిరసనలు దిగుతూ కాలక్షేపం చేస్తున్నారని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శిస్తోంది. కేంద్రం వడ్లు కొంట అంటున్న కూడా టీఆర్ఎస్ పార్టీ దీనిపై క్లారిటీ ఇవ్వకుండా రైతులను మభ్యపెడుతున్నారని అంటున్నారు.

  First published:

  Tags: Karimangar, TRS leaders

  ఉత్తమ కథలు