హోమ్ /వార్తలు /తెలంగాణ /

Prashanth Kishore| CM KCR: ప్రశాంత్​ కిషోర్​కి బైబై చెప్పనున్న కేసీఆర్​​! టీఆర్​ఎస్​కు మరో ఎన్నికల వ్యూహకర్త?​

Prashanth Kishore| CM KCR: ప్రశాంత్​ కిషోర్​కి బైబై చెప్పనున్న కేసీఆర్​​! టీఆర్​ఎస్​కు మరో ఎన్నికల వ్యూహకర్త?​

సీఎం కేసీఆర్​, పీకే​ (ఫైల్​)

సీఎం కేసీఆర్​, పీకే​ (ఫైల్​)

రాష్ట్రంలో టీఆర్ఎస్​కు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్నారంటూ సీఎం కేసీఆరే ఇటీవల స్వయంగా ప్రకటించారు. అయితే తాజాగా ప్రశాంత్​ కిషోర్​ వ్యహహారం టీఆర్ఎస్​లో గందరగోళం సృష్టించింది. 

  దేశంలో విజయవంతమైన రాజకీయ వ్యూహకర్త (Political strategist)గా పేరుపొందిన ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) ను ప్రస్తుతం తెలంగాణ అధికార టీఆర్ఎస్ (TRS) పార్టీ ఎంగేజ్ చేసుకుంది. కొద్ది రోజుల కిందట నేరుగా తెలంగాణలో పర్యటించి, గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ను కలిసి, కీలక రిపోర్టులు అందజేశారాయన. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ (CM KCR)తో పీకే భేటీ అవ్వడంతో పాటు గులాబీ బాస్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పర్యటించి.. అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఆయన టీమ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి.. ప్రాథమిక నివేదిక ఇచ్చారు.  రాష్ట్రంలో (Telangana) టీఆర్ఎస్​కు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్నారంటూ సీఎం కేసీఆరే ఇటీవల స్వయంగా ప్రకటించారు. అయితే తాజాగా ప్రశాంత్​ కిషోర్​ వ్యహహారం టీఆర్ఎస్​లో గందరగోళం సృష్టించింది. ఆయన కాంగ్రెస్​లో చేరబోతున్నట్లు సంకేతాలు వచ్చాయి. పీకే కాంగ్రెస్‌లో చేరి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని ప్రచారం జరుగుతోంది.

  ఈ సమయంలో.. ఆయన సేవలు (Political strategist) వాడుకునే విషయంలో గులాబీ బాస్‌ సందిగ్ధంలో పడ్డట్టు తెలుస్తోంది. అయితే పీకే శిష్యుడు సునీల్ సేవలు కేసీఆర్​ వాడుకుంటారని వార్తలు సైతం వస్తున్నాయి. కానీ, సునీల్​ సైతం కాంగ్రెస్​ కోటరీలో సెటిలవ్వడంతో ఇది సాధ్యమయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు.

  దక్షిణాదిన సునీల్​.. ఉత్తరాదిలో పీకే..

  కొద్ది నెలల్లో నార్త్ లోని పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ అటువైపు దృష్టి పెట్టాలని ఏఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి ఇద్దరు వ్యూహకర్తలతో ఏఐసీసీ అగ్రనేతలు సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే సునీల్, ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) కు మధ్య ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. దీనిలో భాగంగానే నార్త్ లో పెద్ద రాష్ట్రాలైన రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ ఎన్నికలు ఉండగా, హర్యానాలో కూడా ఎన్నికలు రానున్నాయి. అందుకే పీకేకు అటువైపు బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్​కు సేవలందిస్తున్న సునీల్​కు దక్షిణాది బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

  కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ ఒక్కటేననే భావన..

  రాజకీయ సమీకరణాల్లో భాగంగా వేరే పార్టీకి పనిచేయాల్సి వస్తే తన టీం సభ్యులు టీఆర్​ఎస్​ పార్టీకే పనిచేస్తారని అప్పట్లోనే కేసీఆర్​కు పీకే హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇపుడు పీకే కాంగ్రెస్​లో చేరితే.. ఆయన ఐప్యాక్​ సేవలు టీఆర్​ఎస్​ వినియోగించుకుంటే ప్రజల్లో కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ ఒక్కటేననే భావన వెళుతుందని టీఆర్​ఎస్​ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. ఇదే జరిగితే ఇక బీజేపీ ఆరోపణలకు ఊతం ఇచ్చినట్లు కూడా అవుతుంది. దీంతో పీకే ఒకవేళ కాంగ్రెస్​లో చేరితే వెంటనే ఆయన సేవలు తీసుకోవట్లేదని చెప్పేయాలని టీఆర్​ఎస్​ భావిస్తోందట.

  ఇప్పటికిప్పుడు ఎన్నికల వ్యూహకర్త (Political strategist)ను నియమించుకోవడం కంటే రాజకీయ ఉద్ధండుడిగా పేరు గాంచిన కేసీఆర్​ సేవలు చాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయట. దీంతో ఇప్పట్లో మరో ఎన్నికల వ్యూహకర్త ఆలోచనలు టీఆర్​ఎస్​ చేసే అవకాశం లేదు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Prashant kishor, Telangana, Telangana Politics

  ఉత్తమ కథలు