బీజేపీ ప్రభుత్వానికి (BJP Government) ప్రత్యామ్నాయం కేసీఆర్ (KCR) మాత్రమేనని వీలైనంత త్వరగా భారతదేశ పగ్గాలను సీఎం కేసీఆర్ చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. ప్రపంచం నివ్వెరపోయేలా తెలంగాణ అభివృద్ధి చేశారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పాలనలో దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మంత్రి తెలిపారు. కరీంనగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ లో మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే సత్తా కేవలం కేసీఆర్ (KCR) కే ఉందని చెప్పారు. ప్రపంచం నివ్వెరపోయేలా తెలంగాణాను (Telangana) అభివృద్ది చేశారని కొనియాడారు. 70 సంవత్సరాల పాలనలో ఏ ప్రభుత్వానికి కాళేశ్వరం గుర్తుకురాలేదన్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణ అభివృద్దిని సందర్శిస్తున్నారని గుర్తుచేశారు.
కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి ఆయుధం దేశానికి కావాలంటూ ప్రజలు కోరుతున్నారని తెలిపారు. భారత దేశ (India) ప్రజలకు కేసీఆర్ సేవలు అవరసమని... వీలైనంత త్వరగా సీఎం కేసీఆర్ భారతదేశ పగ్గాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఎన్డీఏ (NDA) ప్రభుత్వ పాలనలో దేశ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ తో వైఎస్ జగన్ (AP CM YS Jagan) లాంటి నాయకులు కలిసివచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని గంగుల అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్రం అధోన్నతి పాలవుతున్న సమయంలో ప్రజల గొంతుగా సీఎం కేసీఆర్ (CM KCR) రాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేశారు. దేశ ప్రజలందరి గొంతుకలాంటి ఆయుధం సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
కేసీఆర్, జగన్ మధ్యలో పీకే..
కాగా, తెలంగాణలో టీఆర్ఎస్ (TRS) పార్టీకి, ఏపీలోని వైఎస్సార్సీపీ (YSRCP)కి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) ఉన్నారు. ఈ నేపథ్యంలో గంగుల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) కేంద్రంలోని బీజేపీకి నేరుగా మద్దతు ఇవ్వకపోయినా బయటినుంచి ఇస్తున్నారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జగన్కు సన్నిహితుడు కావడం ఇక్కడ ఆలోచించదగ్గ విషయం. జగన్పై ఇప్పటికే పలు కేసులు ఉండటం.. సీబీఐ విచారణ కోర్టు పరిధిలో ఉండటంతో ఆయన నేరుగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వకపోవచ్చు. అయితే బయటి నుంచి మాత్రం పచ్చజెండా ఊపే అవకాశం లేకపోలేదు. జగన్ పరిస్థితి కేసీఆర్కు తెలుసు కాబట్టే ఇప్పటివరకు ఆయనను జాతీయ రాజకీయాలపై కలవలేదని పలువురు రాజకీయ నిపుణులు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm jagan, CM KCR, Gangula kamalakar