Home /News /telangana /

TS POLITICS THE SUPREME COURT DISMISSED TELANGANA MINISTER KOPPULA ESHWAR PETITION TO STAY THE COURT HEARING ON THE ASSEMBLY ELECTION RESULTS PRV

Telangana: తెలంగాణ మంత్రికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. పదవికే ఎసరు రానుందా?

కొప్పుల ఈశ్వర్​, సుప్రీం కోర్టు (ఫైల్​)

కొప్పుల ఈశ్వర్​, సుప్రీం కోర్టు (ఫైల్​)

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్‌ ధర్మపురి(Dharmapuri) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఆయన గెలుపును సవాల్​ చేస్తూ ప్రత్యర్థి అప్పుడే కోర్టును ఆశ్రయించాడు. ఇపుడు ఈ కేసులో మరో కీలక అప్​డేట్​ వచ్చింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ధర్మపురి (Dharmapuri) శాసనసభ ఎన్నికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పు సవాల్‌ చేస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ (Minister Koppula Eshwar) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. మంత్రి ఈశ్వర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈశ్వర్‌ తరఫు న్యాయ వాదుల వాదనతో ఏకీభవించని ధర్మాసనం పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతి ఇస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్‌ ధర్మపురి(Dharmapuri) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ (Adluri Laxman Kumar)పై 441 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. కొప్పుల ఈశ్వర్‌కు 70,579 ఓట్లు రాగా.. లక్ష్మణ్‌కుమార్‌కి 70,138 ఓట్లు వచ్చాయి. అయితే ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్ధి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

    మధ్యంతర పిటిషన్ దాఖలు..

    మరోవైపు ఆ పిటిషన్‌ను కొట్టేయాలని మంత్రి కొప్పుల మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు మంత్రి పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో హైకోర్టు ఆర్డర్‌ను సవాల్ చేస్తూ కొప్పుల ఈశ్వర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు మంత్రి కొప్పుల పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఒకవేళ హైకోర్టులో కొప్పులకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆయన మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవి కూడా పోనుంది.


    జర్మనీ పౌరసత్వం విషయంలో..

    ఇలాంటి కేసే మరొకటి తెలంగాణలో ఏళ్లుగా నడుస్తోంది. అదే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​ది. వేములవాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నమనేని రమేష్ బాబు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. రమేష్ బాబుకు జర్మనీ పౌరసత్వం విషయంలో ఇప్పటికే చాలాసార్లు కోర్టు మెట్లు ఎక్కారు. జర్మనీ పౌరసత్వం విషయంలో కాంగ్రెస్ నేత అయినటువంటి ఆది శ్రీనివాస్ కోర్టుల చుట్టూ తిరిగి కేసులు వేస్తున్న విషయం విదితమే.

    KTR: రేపిస్టులను వదిలెయ్యడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం.. ప్రధాని మోదీకి ట్వీట్​

    రమేష్ బాబు కుటుంబ నేపథ్యం చూసుకుంటే, రమేష్ బాబు తండ్రి.. చెన్నమనేని రాజేశ్వర్ రావు కు జిల్లావ్యాప్తంగానే గాక రాష్ట్రవ్యాప్తంగా పేరుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆయన దగ్గర బంధువు కూడా. 5 సార్లు ఎమ్మెల్యే గా ఉన్నారు రాజేశ్వర్ రావు. అయితే రాజేశ్వర్ రావు కొడుకు రమేష్ బాబూ జర్మనీలో చదువుకొని అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకొన్నాడు. అలా జర్మనీ పౌరసత్వం తీసుకోని అక్కడే ఒక యూనివర్సిటీ కి వైస్ ఛాన్స్లర్ గా పనిచేస్తున్నారు. రమేష్ బాబు రాజకీయం గురించి ప్రస్తావిస్తే.. టిడిపి లో ఉన్న ఆయన తెలంగాణా ఉద్యమ సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ లో చేరారు. 2014 లో వేములవాడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి అది శ్రీనివాస్ పై పోటీ చేసి గెలుపొందారు.

    ఎన్నికల అఫిడవిట్ లో తను భారతీయ పౌరుడినని.. తనకు ఇక్కడి పౌరసత్వం కూడా ఉన్నదని రమేష్ బాబు పేర్కొన్నారు. ఇదే విషయం పై కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ కోర్టు ను ఆశ్రయించాడు. రమేష్ బాబు కు ఇండియా పౌరసత్వం లేదని.. ఆయన జర్మనీ పౌరుడని కోర్టుకు తెలపడం తో అప్పటినుండి పౌరసత్వం విషయం నియోజకవర్గం లో హాట్ టాపిక్ గా మారింది. కోర్టు వాదోపవాదనలు వింటూ అప్పటినుండి ఇంకా కేసు నడుస్తూనే ఉంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Koppula eeswar, Supreme Court, TRS leaders

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు