Home /News /telangana /

TS POLITICS THE PARTY HAS TAKEN THE SUICIDE OF BJP LEADER SAI GANESH SERIOUSLY AND THE BJP LEGAL CELL IS COMING TO KHAMMAM KMM PRV

Khammam Sai Ganesh Suicide: బీజేపీ నేత ఆత్మహత్య వెనుక ఏం జరిగింది? ఆందోళన బాటలో బీజేపీ నాయకత్వం.. ఖమ్మం రానున్న పార్టీ లీగల్‌ సెల్‌

(బీజేపీ లీడర్ సాయి గణేష్)

(బీజేపీ లీడర్ సాయి గణేష్)

సాయిగణేష్‌ ఆత్మహత్య ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. పార్టీలో చురుగ్గా పనిచేసే యువ నాయకుడు బలవర్మరణానికి పాల్పడడం పట్ల రాష్ట్ర నాయకత్వం సైతం తీవ్రంగా స్పందించింది. దీనికి బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేస్తూ పార్టీ ఆందోళన బాట పట్టింది.

ఇంకా చదవండి ...
  (జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా)

  బీజేపీ (BJP) శ్రేణుల రగడతో రెండు రోజుల పాటు ఖమ్మంలో ఆందోళన రేగింది. వీధుల్లోకి వచ్చిన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. తోటి యువ కార్యకర్త, యువ నాయకుని ఆత్మహత్యతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రిలో విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులను సైతం తోసిపారేశారు. బీజేపీ అనుబంధ కార్మిక సంఘం భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని సాయిగణేష్‌ ఆత్మహత్య (Sai Ganesh Suicide)  ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. పార్టీలో చురుగ్గా పనిచేసే యువ నాయకుడు బలవర్మరణానికి పాల్పడడం పట్ల రాష్ట్ర నాయకత్వం సైతం తీవ్రంగా స్పందించింది. దీనికి బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేస్తూ పార్టీ ఆందోళన బాట పట్టింది. తెరాస (TRS) ఖమ్మం నేతల వేధింపులు, పోలీసులు వరుసగా కేసులు నమోదు చేయడం.. రౌడీషీట్‌ తెరవడం.. తాను ఏర్పాటు చేసుకున్న పార్టీ గద్దెను, జెండాను కూల్చేయడం లాంటివి తాను ఆత్మహత్యకు పాల్పడడానికి కారణాలుగా పేర్కొంటూ సాయిగణేష్‌ డెత్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. తనపై పోలీసులు పదహారు కేసులు పెట్టి, రౌడీ షీట్‌ తెరచి నిత్యం వేధింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

  పోలీస్టేషన్‌ దగ్గరలోనే బీజేపీ జెండా గద్దె..

  ఖమ్మం (Khammam) నగరంలోని త్రీటౌన్‌ ప్రాంతానికి చెందిన సామినేని సాయిగణేష్‌ బీజేపీలో చురుకైన కార్యకర్త. తల్లిదండ్రులు లేని సాయిగణేష్‌ అమ్మమ్మ పెంపకంలో ఉంటూ.. చదువు అయిపోతూనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపునకూ స్పందిస్తూ చిన్నవయసులోనే భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ విభాగానికి జిల్లా అధ్యక్షునిగా ఎదిగాడు. త్రీటౌన్‌ ఏరియాలో సాయిగణేష్‌ కార్యకలాపాలు పెరగడం, పోలీసుస్టేషన్‌ దగ్గరలోనే భాజపా జెండా గద్దెను ఏర్పాటు చేయడం.. నగరంలో మునిసిపల్‌ కార్పొరేటర్లు చేస్తున్న పలు అభివృద్ధి పనుల నాణ్యతను, పనుల ఎంపికను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో చర్చకు పెడుతూ, తెరాస నేతలకు కొరకరాని కొయ్యగా మారాడు. దీంతోనే సాయిగణేష్‌పై పదహారు కేసులు నమోదయ్యాయని భాజపా నాయకత్వం ఆరోపిస్తోంది. తమ పార్టీకి చెందిన చురుకైన కార్యకర్తలను తెరాస నాయకత్వం టార్గెట్‌ చేస్తున్నదంటూ ఆరోపిస్తున్నారు.

  పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే..

  త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే సాయిగణేష్ పురుగుల మందు తాగాడని, అతను మీడియాలో హైలెట్‌ కావడానికే అలా చేస్తున్నాడని పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే సాయిగణేష్‌ మృతిచెందాడని భాజపా నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మెరుగైన వైద్యం కోసం సాయిగణేష్‌ను హైదరాబాద్‌ తరలించినా మృతిచెందాడు.  సాయిగణేష్‌ మృతదేహాం వెంట భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్‌లు వస్తున్నారన్న వార్తలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాదయాత్రలో ఉన్న పార్టీ. అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ సాయిగణేష్‌ మృతిని ఖండించారు.

  ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యేనని, బాధ్యులైన పోలీసులు, తెరాస నేతలపై హత్యానేరం మోపాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అయితే సాయిగణేష్‌ మృతి అనంతరం భాజాపా నాయకులు ఈ విషయానికి ఉన్న తీవ్రతను రాజకీయంగా ఇస్యూ చేయలేకపోయారన్న విమర్శలు సైతం పార్టీ నేతల నుంచే వ్యక్తం అవుతున్నాయి. సోమవారం నాడు పార్టీ జిల్లా నేతలు సీపీ విష్ణువారియర్‌ను కలిసి వినతి పత్రం అందించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ లీగల్‌సెల్‌ ( Party legal Cell) సభ్యులతో సమావేశమై, ఖమ్మం పర్యటించి సాయిగణేష్‌ మృతికి కారణాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని సూచించారు.

  ఒక యువ నాయకుడు, పార్టీలో చురుకైన వ్యక్తిపై పదహారు కేసులు నమోదు చేయడం, రౌడీ షీట్‌ తెరవడాన్ని భాజపా తీవ్రంగా పరిగణిస్తోంది. అయితే భాజపా నేతల ఆరోపణలపై ఖమ్మం పోలీసులు వివరణ ఇచ్చారు. సాయిగణేష్‌పై కేవలం ఎనిమిది కేసులే ఉన్నాయని, అతను పురుగుల మందు తాగాకే త్రీటౌన్‌ స్టేషన్‌కు వచ్చినట్టు ఏసీపీ ఆంజనేయులు స్పష్టం చేశారు. మొత్తంమీద సాయిగణేష్‌ బలవన్మరణం వెనుక ఏంజరిగిందనేది తేలాల్సి ఉంది.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Khammam, Telangana bjp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు