హోమ్ /వార్తలు /తెలంగాణ /

EC: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన BRS బృందం..ఈసీకి తీర్మానం కాపీ అందజేత

EC: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన BRS బృందం..ఈసీకి తీర్మానం కాపీ అందజేత

కేసీఆర్, ఈసీ

కేసీఆర్, ఈసీ

దసరా పండుగ శుభసందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఉన్నTRS (Telangana rashtra samithi)ని BRS (bharath rashtra samithi)గా మారుస్తూ అధికారిక ప్రకటన చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Delhi

  దసరా పండుగ శుభసందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఉన్నTRS (Telangana rashtra samithi)ని BRS (bharath rashtra samithi)గా మారుస్తూ అధికారిక ప్రకటన చేశారు. దీనితో టీఆర్ఎస్ ఇక బిఆర్ఎస్ గా మారబోతుంది. కేసీఆర్ ప్రకటనతో 21 ఏళ్ల టిఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి BRS తీర్మానం అందజేయడానికి టీఆర్ఎస్ బృందం ఢిల్లీ వెళ్లారు.

  ఆ బృందంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వీరు టీఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా తీర్మానం చేసిన కాపీని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ ధర్మేంద్ర శర్మకు అందజేసినట్లు వారు తెలిపారు. ఆ కాపీని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ధర్మేంద్ర చెప్పారని టీఆర్ఎస్ నాయకులూ వివరించారు. అంతేకాదు మునుగోడులో పోటీ చేసే పార్టీ పేరుపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. మునుగోడు (Munugodu) ఉపఎన్నిక వరకు పేరు మారితే దాని మీదే పోటీ చేస్తామని తెలిపారు.

  అంతేకాదు పార్టీ పేరు మార్చుకునేలా ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29-ఏ చెబుతుందని అన్నారు. అయితే దేశంలో ఏ రాజకీయ పార్టీ అయిన తమ పార్టీ పేరు, చిరునామా మార్చుకుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ (Vinod kumar) తెలిపారు. BRS తో ఇంకా వేరే పార్టీలున్నాయని ఆయనను మీడియా ప్రశ్నించగా..అబ్రివేషన్ తో ఉన్నాయి కానీ పార్టీ పూర్తి పేరు ముఖ్యం అని ఆయన తెలిపారు.

  ఇక టీఆర్ఎస్ నాయకులు అందజేసిన తీర్మానాన్ని ఈసీ పరిశీలించనుంది. ఒకవేళ ఏవైనా వివరణలు అవసరమైతే సంబంధిత పార్టీని ఈసీ కోరుతుంది. అయితే ఇదే పేరుపై ఇప్పటికే గుర్తింపు పొందిన పార్టీలలో ఈ తరహా పేరు ఉందా అన్న అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commision) పరిశీలించనుంది. అలాగే పార్టీ పేరు మార్పుపై రాజకీయ పార్టీ జాతీయ స్థాయిలో రెండు ప్రధాన పత్రికల్లో ప్రకటన చేయాల్సి ఉంటుంది.  దీనికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం లభిస్తే ఇక TRS..BRS పార్టీగా మారబోతుంది.

  ఇక కేసీఆర్ 2024 ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేయబోతున్నారు. తమతో కలిసి వచ్చే మిగతా ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ముందుకెళ్లనున్నట్లు తెలుస్తుంది. అయితే బీజేపీ , కాంగ్రెస్ కాకుండా మిగతా పార్టీలన్నీటిని కలుపుకొని అధికారంలోకి రావాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట.

  Published by:Rajashekar Konda
  First published:

  Tags: Trs

  ఉత్తమ కథలు