Home /News /telangana /

TS POLITICS THE BJP HAS LAUNCHED AN INNOVATIVE POLITICAL CAMPAIGN WITH A WEBSITE CALLED SELVUDORA WITH KALVAKUNTLA COUNTDOWN IN TELANGANA PRV

Selavudora: ‘‘కల్వకుంట్ల కౌంట్​డౌన్​.. 529 రోజులు’’ : తెలంగాణలో బీజేపీ వినూత్న ప్రచారం

బీజేపీ కార్యాలయంలో తరుణ్​చుగ్​

బీజేపీ కార్యాలయంలో తరుణ్​చుగ్​

తెలంగాణలో బీజేపీ వినూత్న రాజకీయ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. TRS ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఇంకా మరో 529 రోజులే ఉన్నాయంటూ గంటలు, నిమిషాలు, సెకన్లను కౌంట్‌డౌన్‌గా చూపుతూ ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.

  తెలంగాణలో టీఆర్ఎస్‌ (Telangana Rastra Samithi)కు తిరుగులేదు. కారు జోరుకు ఎదురు లేదు. ఇది మొన్నటి మాట. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. గులాబీ పార్టీ తిరుగులేని శక్తగా ఎదుగుతున్న సమయంలో బీజేపీ (BJP) రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. దీనిబట్టి తెలంగాణలో బీజేపీ పార్టీ పుంజుకుంటోందని స్పష్టంగా అర్ధమవుతోంది. ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలు కూడా బీజేపీ బలం పెరగడానికి కారణాలయ్యాయి. కరీంనగర్​లో బండి సంజయ్​ అరెస్టు, ధాన్యం కొనుగోళ్లు, ఇటీవల చోటుచేసుకున్న అత్యాచారాలపై పోలీసుల వైఖరిపై బీజేపీ నిలదీతలు కమలం పార్టీ ఛరిష్మాను తెలియజేశాయి. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ పని అయిపోయిందంటూ బీజేపీ నేతలు ప్రచారం మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ (Telangana)లో బీజేపీ వినూత్న రాజకీయ ప్రచారానికి శ్రీకారం చుట్టింది.  TRS ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఇంకా మరో 529 రోజులే ఉన్నాయంటూ గంటలు, నిమిషాలు, సెకన్లను కౌంట్‌డౌన్‌గా చూపుతూ selavudora అనే ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్​సైట్​లో (Selavudora.com) అందరూ రిజిస్ట్రేషన్​ చేసుకోవల్సిందిగా బీజేపీ సూచించింది.

  ‘‘సాలు దొర–సెలవు దొర’... కల్వకుంట్ల కౌంట్‌డౌన్‌’ (Saaludora selavudora Kalvakunta countdown) అంటూ డిజిటల్‌ గడియారం Live Display నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయం గేటు పక్కన ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్‌పై ‘సాలు దొర, సెలవు దొర’అనే నినాదాలతో సీఎం కేసీఆర్‌ ఫొటోలను ప్రదర్శిస్తున్నారు. శనివారం రాష్ట్ర కార్యాలయంలో ఈ ‘వెబ్‌ క్యాంపెయిన్‌’ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రారంభించారు. ‘ఈ డిజిటల్‌ స్క్రీన్‌ను అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో, బీజేపీ నిర్వహించే ప్రతీ కార్యక్రమాల్లోనూ ఏర్పాటు చేస్తాం.  ఈ గడువు ముగిసేదాకా సంజయ్‌ నేతృత్వంలో నేతలు రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తారు. ఇక చాలు గద్దె దిగండి.. బీజేపీ వస్తోందని నినదిస్తారు’అని పేర్కొన్నారు. 529 కౌంట్‌డౌన్‌ తర్వాత ఏమి జరగబోతుందని మీడియా ప్రశ్నించగా 530వ రోజున తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని ఆయన బదులిచ్చారు.  మరోవైపు ఈ సెలవుదొర వెబ్​సైట్​ (Website)ను బీజేపీ నాయకులు ట్రెండ్​ చేస్తున్నారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం ఓ ట్వీట్​ వేశారు. ఓట్ల కోసం పూటకో మాట మార్చే సీఎం రాష్ట్రానికి అవసరమా ..  సాలు దొర సెలవు దొర అంటూ పోస్టు పెట్టారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ దాటరని, ఆయన అరాచక శక్తులకు కొమ్ముకాస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. పథకాల పేరుతో కేసీఆర్ రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. అక్రమాలపై చర్యలు తీసుకోవడంలేదని ఫైర్ అయ్యారు. ప్రజల బాగోగులను ఏమాత్రం పట్టించుకోని కేసీఆర్ అవసరమా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని కోరుతూ సాలు దొర... సెలవు దొర అంటూ రఘునందన్ రావు ట్వీట్ చేశారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Telangana, Telangana bjp, Telangana Politics, Trs, Website

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు