బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla kavitha) పాత్ర ఉందంటూ వస్తున్న ఆరోపణలపై సోమవారం ఆమె ఇంటి దగ్గర బీజేపీ శ్రేణులు దాడికి ప్రయత్నించారు. ఈవ్యవహారంపైనే పోలీస్ కంప్లైంట్(Police Complaint)నమోదు కావడంతో 26మంది బీజేపీ నాయకులు, కార్యకర్తల మీద బంజారాహిల్స్ (Banjara Hills)పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసు కేసుల్ని నిరసిస్తూ మంగళవారం జనగామ (Jangaon) జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్(Karimnagar)ఎంపీ బండి సంజయ్ చేస్తున్న ప్రజాసంగ్రామ పాదయాత్ర దీక్షాశిభిరం దగ్గర ధర్నాకు దిగారు. స్టేషన్‌ఘనపూర్ మండలం పామ్నూర్‌లో పాదయాత్ర శిభిరం దగ్గర దీక్షను పోలీసులు భగ్నం చేసి బండి సంజయ్‌ను అరెస్ట్ (arrest)చేశారు.
బీజేపీ నేతల వరుస అరెస్ట్‌లు..
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై దాడి వ్యవహారంపైనే పోలీస్ కంప్లైంట్ నమోదైంది. 26మంది బీజేపీ నాయకులు, కార్యకర్తల మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.దాడి చేసిన వారిలో పలువుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఐపీసీ 341, 147, 148, 353, 332, 509. 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బీజేపీ శ్రేణులపై కేసులు, అరెస్ట్‌ను నిరసిస్తూ మంగళవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘనపూర్ మండలం పామ్నూర్‌లో పాదయాత్ర శిభిరం దగ్గర బండి సంజయ్ దీక్షకు దిగారు. దీంతో పోలీసులు చేరుకొని దీక్షనుభగ్నం చేశారు. ఆయన్ని అరెస్ట్ చేశారు. ఈక్రమంలో పోలీసులతో బీజేపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. అరెస్ట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు బలవంతంగా బండి సంజయ్‌ని అరెస్ట్ చేశారు. పోలీసుల వాహనాన్ని అఢ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ శ్రేణులను బలవంతంగా పక్కకు నెట్టివేయడంతో పలువురికి గాయాలయ్యాయి. బండి సంజయ్‌ని పోలీసులు జీపులో ఎక్కించుకొని వరంగల్ జిల్లా చిలుపూర్రు గుట్ట వైపుగా తీసుకెళ్తారు.
దీక్షభగ్నం..బండి అరెస్ట్ ..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన కొందరువ్యక్తులు తెలంగాణకు చెందిన ఓ లిక్కర్ మాఫియా నేత ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఫ్లైట్‌లో ఢిల్లీకి వచ్చారని చెప్పారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో సెటిల్‌మెంట్ కుదుర్చుకున్నారని విమర్శించారు. ఫస్ట్ ఇన్‌స్టాల్మెంట్‌గా ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాకు 150కోట్ల రూపాయలు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ.
Rajasingh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ .. వీడియోలో ఆ వ్యాఖ్యలు చేయడం వల్లే ముస్లింలు ఆగ్రహం
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ..
ఢిల్లీ బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలపై బండి సంజయ్ సైతం వంత పలికారు. ప్రతి స్కాంలో కేసీఆర్ ఫ్యామిలీకి పాత్ర ఉందని విమర్శించారు. అంతే కాదు ఇలాంటి కుంభకోణాలన్నింటిని బయటకు లాగుతామని ..వదిలిపెట్టమని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు బండి సంజయ్. దీనికి కొనసాగింపుగానే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడికి ప్రయత్నించడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అయితే బండి సంజయ్ ఆరోపణలు వచ్చిన కవితపై కేసులు పెట్టడం, విచారించకుండా బీజేపీ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారంటూ విమర్శలు చేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.