మునుగోడులో టీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగుతుంది. ఇప్పటివరకు 13 రౌండ్లు పూర్తి కాగా TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం దిశగా వెళ్తున్నారు. అయితే టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీనిచ్చింది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ ను కూడా దక్కించుకోలేకపోయింది. టీఆర్ఎస్ ఆధిక్యంతో తెలంగాణ భవన్ లో సంబరాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ఆసక్తికర ట్వీట్ చేశారు. కేసీఆర్ వెంటే తెలంగాణ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇందులో హరీష్ రావు వెనకాల కేసీఆర్ ఫోటో ఉండగా హరీష్ రావు కళ్లద్దాలు పెట్టుకొని ఏవో పత్రాలను పరిశిలీస్తున్నారు.
#TelanganaWithKCR ???? pic.twitter.com/x3YCjCDH1e
— Harish Rao Thanneeru (@trsharish) November 6, 2022
మరోవైపు మునుగోడు( Munugodu)ఉపఎన్నికల ఫలితాల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లుగా ప్రకటించారు బీజేపీ అభ్యర్దిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (Komati Reddy Rajagopal Reddy). మొదటి రౌండ్ మినహా మిగిలిన అన్నీ రౌండ్లు టీఆర్ఎస్(TRS)పార్టీ క్రమంగా మెజార్టీ పుంజుకుంటూ చివరకు ఏడు వేల ఓట్ల ఆధిక్యం దాటిపోవడంతో ఆయన ఓటమిని అంగీకరించారు. బీజేపీ అభ్యర్ధిగా పోటీలో నిలబడిన తనను అధికార పార్టీ తనను ప్రచారం చేయనివ్వకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు రాజగోపాల్రెడ్డి. అయితే తాను అధర్మంగా గెలిచినట్టేనని చెప్పారు. ఎందుకంటే దీనికి ఒకటే ఒక ఉదాహరణ భారత దేశ చరిత్రలో ఎన్నికల మధ్యలో రిటర్నింగ్ అధికారి(Returning Officer)ని సస్పెండ్(Suspend)చేయడం అనేది ఇదే మొట్టమొదటిసారి జరిగిందన్నారు.
13వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ ఆధిక్యత 9000లకు పైగా చేరుకుంది. మరో రెండు రౌండ్ల ఓటింగ్ లెక్కింపు మాత్రమే ఉండటం.. ఓట్ల లెక్కింపు జరగాల్సిన మండలాల్లో తమకే మెజార్టీ వచ్చే అవకాశం ఉండటంతో.. తమ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ శ్రేణులు అప్పుడే తెలంగాణ భవన్లో డప్పులు మోగిస్తూ, బాణాసంచా కాల్చూతూ సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. 2,3 రౌండ్ల బీజేపీ(BJP) ఆధిక్యత సాధించడంతో సీన్ మారిపోతుందేమో అని చాలామంది భావించారు. కానీ ఆ తరువాత 4వ రౌండ్ నుంచి 13వ రౌండ్ టీఆర్ఎస్ ఆధిక్యత కొనసాగుతూ వచ్చింది. క్రమక్రమంగా టీఆర్ఎస్ తన ఆధిక్యతను పెంచుకుంటూ పోయింది. 11వ రౌండ్లో టీఆర్ఎస్కు 7,235, బీజేపీకి 5,877 ఓట్లు వచ్చాయి. 15వ రౌండ్ ముగిసే సమాయానికి టీఆర్ఎస్ మెజార్టీ మరింతగా పెరుగుతుందని గులాబీ పార్టీ కార్యకర్తలు లెక్కలు వేసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.