ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind).. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏకంగా కేసీఆర్ (CM KCR) కూతురు కల్వకుంట్ల కవితపైనే పోటీ చేసి నిజామాబాద్ ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు. ఏకంగా సీఎం కేసీఆర్ కూతురునే ఓడించడంతో తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఆయన పేరు ప్రముఖంగా మారింది. టీఆర్ఎస్ నేతల నుంచి వచ్చే విమర్శలకు తనదైన స్టైల్లో కౌంటర్లు విసురుతూ ఉంటారు అర్వింద్. అయితే.. వచ్చే ఎన్నికల్లో తాను ఆర్మూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఓడిస్తానంటూ ఇటీవల ఆయన చేసిన ప్రకటన మరో సారి తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆయన రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ యూ ట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వాఖ్యలు మరో సారి హాట్ టాపిక్ గా మారాయి. రానున్న శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కోరుట్ల, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ అసెంబ్లీ స్థానాలను తాము గెలవడం ఖాయమని చెప్పారు. జగిత్యాల, బోధన్, నిజామాబాద్ అర్బన్ స్థానాల్లో ప్రస్తుతం నువ్వా? నేనా? అన్నట్లుగా ఫైట్ ఉందన్నారు.
వచ్చే ఎన్నికల నాటికి ఆ స్థానాలను కూడా కైవసం చేసుకుంటామని ఎంపీ అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో కేసీఆర్ కూతురు కవిత ఓడిపోతుందంటూ.. తాను చెప్పిన విషయం నిజమైందని ఆయన గుర్తు చేశారు. హిందువులంతా ఆలోచన చేసి యునైటెడ్ గా ఓటేద్దామని పిలుపునిచ్చారు. బీజేపీని మతతత్వ పార్టీగా కొందరు దొంగ చిత్రీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోదీ పాలనలలో హిందూ, ముస్లింలతో పాటు అన్ని వర్గాల వారికి మేలు జరుగుతోందన్నారు. Khammam: పురుగుల మందు తాగి బీజేపీ నేత సూసైడ్..చావుకు కారణం వాళ్లేనట
ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఎలాగైనా కేసీఆర్ ను గద్దె దించి అధికారం చేపట్టాలని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.