kmoతెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కాంగ్రెస్‌లో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంచి పట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీ పరాజయాలు చవిచూస్తున్నా.. కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం విజయాలు అందుకున్నారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య రాజకీయంగా అభిప్రాయాలు భేదాలు వచ్చాయనే చర్చ జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని.. ఇక ఆ పార్టీలో కొనసాగడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkatreddy ) తమ్ముడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) భావిస్తున్నారు. ఆయన వ్యవహారశైలి, మాటలు కూడా ఇందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలన సృష్టించాయి. క్యారెక్టర్ లేని వాళ్ల దగ్గర పని చేయలేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయన పార్టీ మారడం దాదాపు ఖాయమనే చర్చ మరోసారి మొదలైంది.
కోమటిరెడ్డి బ్రదర్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. రాజకీయంగా ఇప్పటివరకు కలిసే ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చురుగ్గా ఉంటే.. రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టుగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలతో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్‌కు దూరం కాబోతున్నారనే చర్చ మొదలైంది. అయితే తాజాగా రేవంత్ రెడ్డితో(Revanth Reddy) కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఈ వ్యవహారంపై స్పందించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు వెంకట్ రెడ్డి. ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులకు వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయని అన్నారు. ఇటీవల తాను ప్రధానిని కలిస్తే పార్టీ మారుతున్నట్టు కొందరు ప్రచారం చేశారని మండిపడ్డారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని అన్నారు. రేవంత్ రెడ్డితో కలిసి పని చేస్తానని చెప్పుకొచ్చారు.
రేపటి రోజు రేవంత్ రెడ్డిదా ? లేక జగ్గారెడ్డిదా ?.. తెలంగాణ కాంగ్రెస్‌లో టెన్షన్ టెన్షన్
KCR: ముందస్తు ఎన్నికలు లేవంటూనే.. పరిస్థితి అలా ఉందన్న కేసీఆర్.. 25 రోజుల తరువాత రిపోర్ట్..
రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే.. వెంకట్ రెడ్డి ఆయనకు మద్దతుగా ఉండటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో రాజకీయంగా కోమటిరెడ్డి బ్రదర్స్ దారులు వేరయ్యాయనే ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్టయ్యింది. ఉమ్మడి నల్లగొండ జిలాలో ఈ అన్నదమ్ములిద్దరికీ అభిమానులు ఉన్నారు. తాజాగా వీరిద్దరూ వేర్వేరు రాజకీయ పార్టీల్లోకి వెళితే.. వీరి అనుచరులు, అభిమానుల ఎవరి వైపు ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.