తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ తమిళిసై అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ తమిళిసైతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy) భేటీ కానున్నారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్‌కు సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇవ్వనున్నారు. నిన్ననే గవర్నర్ తమిళిసై లేఖపై స్పందించిన తెలంగాణ(Telangana) విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్పందించారు. గవర్నర్ నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చిందని తెలిపారు. గవర్నర్‌ను కలవాలని ప్రభుత్వం తనను ఆదేశించిందని చెప్పారు. గవర్నర్‌ను కలిసి లేఖపై సందేహాలు నివృత్తి చేస్తామని అన్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ కోరామని... అయితే అది ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. నిన్న మీడియా ముందుకు వచ్చి తెలంగాణ ప్రభుత్వంపై సంచలన విమర్శలు చేసిన గవర్నర్ తమిళిసై.. తాజాగా ఈ రోజు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర అధికారులకు అపాయింట్మెంట్ ఇచ్చారు.
ఇక నిన్న తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డ తమిళిసై.. బిల్లుల్ని తానే ఆపానని తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఒక్కో బిల్లును కూలంకషంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుకే తొలి ప్రాధాన్యత ఇచ్చానని అన్నారు. కొత్త రిక్రూట్’మెంట్ బోర్డు అంశంలో క్లారిటీ కావాలని అడిగానని వివరించారు. దానికి నేనేదో బిల్లును ఆపానని ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు. కొత్తగా రిక్రూట్’మెంట్ బోర్డు ఎందుకని ఆమె ప్రశ్నించారు. కొత్తగా రిక్రూట్మెంట్ బోర్డు పెడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్నది తన సందేహమని అన్నారు. తెలంగాణకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే తాను క్లారిఫికేషన్ అడిగానని అన్నారు. ఈ విషయంలో మంత్రి అవగాహన లేకుండా మాట్లాడారని కామెంట్ చేశారు. యూనివర్సిటీల పరిస్థితులు కళ్లారా చూశానని అన్నారు.
యూనివర్సిటీ మెస్‌లలో తినడానికి తిండి లేదని చెప్పుకొచ్చారు. అక్కడి పరిస్థితులను ప్రభుత్వం మెరుగుపరచాలని సూచించారు. బిల్లును సమగ్రంగా పరిశీలించేందుకే సమయం తీసుకున్నానని అన్నారు. ఫామ్ హౌస్ కేసులోనూ రాజ్ భవన్‌ను లాగాలని చూశారని ఆరోపించారు. తుషార్ గతంలో నా ఏడీసీగా పని చేశారని.. తుషార్ పేరును ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారని అన్నారు. ఆయన తన ఏడీసీగా పని చేసినంత మాత్రానా రాజ్ భవన్‌ను ఈ కేసులోకి లాగుతారా ? అని ప్రశ్నించారు.
Telangana|TRS: MLAగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రమాణం .. TRSలో భయం మొదలైందన్న బండి సంజయ్
రాజ్ భవన్ ముందు ఆందోళన చేస్తామని జేఏసీ హెచ్చరిస్తోందని.. కానీ ఆందోళనలు చేసేలా వారిని ఎవరు రెచ్చగొడుతున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లాగా రాజ్ భవన్ గేట్లు మూసివేయలేదని తమిళిసై అన్నారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారనే అనుమానం ఉందని.. ఎవరొచ్చినా మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గవర్నర్ వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Governor Tamilisai Soundararajan, Sabita indra reddy, Telangana