Home /News /telangana /

TS POLITICS TELANGANA MINISTER PUVVADA AJAY SENT DEFAMATION NOTICES TO TEENMAR MALLANNA SNR KMM

Puvvada Ajay: తీన్మార్ మల్లన్నపై పరువు నష్టం దావా..10కోట్లు చెల్లించాలన్న మంత్రి

(తీన్మార్‌ మల్లన్నపై పరువునష్టం దావా)

(తీన్మార్‌ మల్లన్నపై పరువునష్టం దావా)

Telangana:క్యూ న్యూస్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్నపై మంత్రి పువ్వాడ పరువునష్టం దావా వేశారు. జర్నలిస్ట్ పేరుతో నిరాధారమైన ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగించారని అందుకు పరిహారంగా తీన్మార్ మల్లన్న 10కోట్లు చెల్లించాలని నోటీసులు పంపారు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.

ఇంకా చదవండి ...
    (G.SrinivasReddy,News18,Khammam)

    జర్నలిస్ట్, క్యూ న్యూస్(Q News)యూట్యూబ్‌ చానల్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)అలియాస్ అలియాస్ చింతపండు నవీన్‌కుమార్‌(Naveenkumar)పై పరువునష్టం దావా వేశారు తెలంగాణ రోడ్డు రవాణాశాఖ మంత్రి(Telangana Road Transport Minister) పువ్వాడ అజయ్‌కుమార్(Puvvada Ajaykumar). జర్నలిస్ట్ ముసుగులో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు మంత్రి పువ్వాడ. తీన్మార్ మల్లన్న వ్యవహారిస్తున్న తీరు పూర్తిగా కల్పితమని, ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్నందున సివిల్(Civil), క్రిమినల్(Criminal)చట్టాల ప్రకారం 10కోట్ల రూపాయలు(10Crore rupees) పరిహరం చెల్లించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నోటీసు(Notices)ల్లో పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన న్యాయవాది(Lawyer)చేత తీన్మార్ మల్లన్నకు ఈ నోటీసుల పంపారు.

    నిరాధారమైన ఆరోపణలు..
    తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్‌కుమార్‌పై క్యూన్యూస్‌ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న తన ఛానల్‌లో కొన్ని ఆరోపణలు చేశారు. అయితే అతని చేసిన ఏ ఆరోపణలు, విమర్శలు వాస్తవం కాదని తన లాయర్‌ ద్వారా పంపిన నోటీసుల్లో వెల్లడించారు. కేవలం తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చడం కోసం, ప్రజల్లో ఓ తప్పుడు సంకేతాన్ని తీసుకెళ్లడం కోసమే తీన్మార్ మల్లన్న ఇదంతా చేస్తున్నాడనేది మంత్రి పువ్వాడ చెబుతున్న మాట. నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేసి ప్ర‌చారం పొందాల‌నే దురుద్దేశంతోనే తీన్మార్ మల్లన్న తన ఛానల్, పత్రికలో అబ‌ద్ధాలు చెప్పారని నోటీసుల్లో న్యాయ‌వాది పేర్కొన్నారు. రాజకీయ దుర్బుద్ధితో, జర్నలిస్ట్‌గా చెలామణి అవుతూ జర్నలిజంలోని కనీస ప్రమాణాలు, విలువలు పాటించకుండా  అసత్యపు ప్రచారం చేశారని న్యాయ‌వాది పేర్కొన్నారు.

    10కోట్ల పరిహారం చెల్లించాలి..
    తీన్మార్ మల్లన్న తనపై చేసిన తప్పుడు ప్రచారానికి, నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తూ మంత్రి పరువునష్టం దావా నోటీసులు పంపారు. సివిల్, క్రిమిన‌ల్ చ‌ట్టాల ప్ర‌కారం 10 కోట్లు ప‌రిహారం చెల్లించాల‌ని మంత్రి నోటీసులో పేర్కొన్నారు. వీటితో పాటు చ‌ట్ట ప్ర‌కారం త‌గిన చ‌ర్య‌ల‌కు అర్హుల‌వుతార‌ని నోటీసుల్లో న్యాయ‌వాది తెలిపారు.ఏడు రోజుల్లో  తన క్లయింట్ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాల‌ని న్యాయ‌వాది డిమాండ్ చేశారు.

    నోటీసులు పంపిన మంత్రి..
    పదే పదే అధికార పార్టీ నేతలపైన, టీఆర్‌ఎస్‌ సర్కారుపై విమర్శలనాస్త్రాలు ఎక్కుపెట్టే తీన్మార్ మల్లన్న మంత్రి పువ్వాడ అజయ్ పంపిన పరువునష్టం నోటీసులపై ఎలా స్పందిస్తారో చూడాలి. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజలకు విశ్వాసం తగ్గిందని పార్టీలో కూడా చీలికలు పెరుగుతాయని ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న ఏ పార్టీల్లో తాను ఇమడలేనని..అలాగని సొంత పార్టీ పెట్టే యోచన కూడా లేదని చెప్పారు. పార్టీలు పెట్టాలి, ఎన్నికల్లో గెలవాలన్నది తన ఉద్దేశం కాదన్న మల్లన్న కేవలం ప్రజల అవసరాలు తీర్చడం కోసమే తన పోరాటం అన్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Puvvada Ajay Kumar, Teenmar mallanna, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు