హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: రాజ్‌భవన్‌కు చేరుకున్న తెలంగాణ మంత్రి.. బడ్జెట్‌‌తో పాటు పెండింగ్ బిల్లులపై చర్చ

Telangana: రాజ్‌భవన్‌కు చేరుకున్న తెలంగాణ మంత్రి.. బడ్జెట్‌‌తో పాటు పెండింగ్ బిల్లులపై చర్చ

రాజ్ భవన్ (ఫైల్ ఫోటో)

రాజ్ భవన్ (ఫైల్ ఫోటో)

Telangana News: పుదుచ్చేరి నుంచి గవర్నర్ తమిళిసై హైదరాబాద్ చేరుకున్న కొద్దిసేపటికే ఆమెతో సమావేశం అయ్యేందుకు మంత్రి ప్రశాంత్ రెడ్డి రాజ్ భవన్ చేరుకున్నారు. బడ్జెట్‌కు ఆమోదంతో పాటు పెండింగ్ బిల్లులపై మంత్రి ప్రశాంత్ రెడ్డి గవర్నర్‌తో చర్చించునున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి రాజ్ భవన్‌కు చేరుకున్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలని ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేయనున్నారు. అదే విధంగా బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి(Prashant Reddy) గవర్నర్ తమిళిసైను కోరనున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి వెంట అసెంబ్లీ కార్యదర్శి, ఫైనాన్స్ సెక్రటరీ అసెంబ్లీకి వెళ్లారు. పుదుచ్చేరి నుంచి గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) హైదరాబాద్ చేరుకున్న కొద్దిసేపటికే ఆమెతో సమావేశం అయ్యేందుకు మంత్రి ప్రశాంత్ రెడ్డి రాజ్ భవన్ చేరుకున్నారు. బడ్జెట్‌కు(Budget) ఆమోదంతో పాటు పెండింగ్ బిల్లులపై మంత్రి ప్రశాంత్ రెడ్డి గవర్నర్‌తో చర్చించునున్నారు.

అంతకుముందు గవర్నర్ వ్యవహారశైలి, ఆమె బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడంపై అసంతృప్తితో ఉన్న తెలంగాణ ప్రభుత్వం.. బడ్జెట్ ఆమోదం తెలిపేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసింది. అయితే ఈ విషయంలో కొన్ని గంటల తరువాత వెనక్కి తగ్గింది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ తరపున లాయర్ దుష్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయని కోర్టుకు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో హైకోర్టులో (High Court) లంచ్ మోహన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ సందర్భంగా గవర్నర్‌ను విమర్శించవద్దనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళతానని హైకోర్టులో ప్రభుత్వం తరపు లాయర్ దుష్యంత్ దవే తెలిపారు. అంతముందు ఈ అంశంపై హైకోర్టు విచారణ వాయిదా వేసిన అనంతరం అడ్వకేట్ జనరల్ ఛాంబర్‌లో ప్రభుత్వం తరపున లాయర్ దుష్యంత్ దవే.. గవర్నర్ తరపున లాయర్ అశోక్ రాంపాల్ సుమారు గంటపాటు చర్చలు జరిపారు.

Breaking News: గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం

Warangal: షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్.. కానీ కండిషన్స్ అప్లై...!

ఈ సందర్భంగా గవర్నర్ విషయంలో పలువురు నేతలు చేసిన విమర్శలు, ప్రభుత్వం వ్యవహరించిన తీరును చర్చించారు. దీంతో ఇకపై అలా జరగదని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే(Dushyant Dave) తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందని కోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించినట్టు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరపడంతో.. లంచ్ మోషన్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ దవే కోర్టుకు వివరించారు.

First published:

Tags: Governor Tamilisai Soundararajan, Telangana

ఉత్తమ కథలు