ఓ వైపు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన తరుణంలోనే తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి(Prashant Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీని వీడతానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) సోనియాగాంధీ(Sonia Gandhi) బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. అందుకే తెలంగాణ ఏర్పాటు ఆలస్యమైందని అన్నారు. ఈ కారణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకున్నా.. సోనియాగాంధీ త్వరగా తెలంగాణ ఇవ్వలేకపోయారని అన్నారు. ఈ జాప్యం కారణంగానే తెలంగాణలో(Telangana) అనేక మంది అమరులయ్యారని ఆరోపించారు. ఈ విషయంలో ఆలస్యానికి నిరసనగా కేసీఆర్ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారని.. మళ్లీ తెలంగాణ రణక్షేత్రంలోకి వచ్చారని అన్నారు. ప్రజాక్షేత్రంలోకి దిగి పోరాటం చేశారని గుర్తు చేశారు.
అయితే షర్మిల అరెస్ట్ పరిణామాల అనంతరం తెలంగాణ మంత్రి షర్మిల తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ టార్గెట్‌గా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. నేరుగా వైఎస్ షర్మిలపై విమర్శలు చేయకపోయినా.. ఆమె తండ్రి వైఎస్ఆర్ తెలంగాణను అడ్డుకున్నారని మంత్రి ఆరోపించడం పరోక్షంగా షర్మిలను లక్ష్యంగా చేసుకోవడమే అనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో 3500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినప్పటికీ.. అంతగా ఆదరణ దక్కించుకోలేకపోయిన వైఎస్ షర్మిల.. నిన్న నేడు జరిగిన పరిణామాలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
షర్మిలను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేయడం.. న్యాయమూర్తి ముందు హాజరుపరచడం వంటి అంశాలు రాజకీయంగా షర్మిలకు ఎంతో కొంత కలిసొచ్చే అంశాలే అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి వైఎస్ఆర్ను టార్గెట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికితోడు ఈ వ్యాఖ్యలు చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడు కావడంతో.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక షర్మిలను కూడా పొలిటికల్‌గా టార్గెట్ చేసేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోందనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఫ్లాష్..ఫ్లాష్: వైఎస్ షర్మిలకు బిగ్ రిలీఫ్..పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి..కానీ..
Bandi Sanjay: భైంసాను దత్తాత తీసుకుంటాం..బహిరంగ సభలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
మరోవైపు వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సీఎం కేసీఆర్ , రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. షర్మిల తన పాదయాత్రలో ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని సూచిస్తూ పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. Ysrtp పాదయాత్రపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పాదయాత్రకు మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాలని హైకోర్టు సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.