తెలంగాణ(Telangana)లోని గత కొద్ది రోజులుగా అధికార పార్టీ నేతల సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే తెలంగాణ కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు (IT Rides)సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి(Mallareddy)కి చెందిన బోయినపల్లి (Boinapally), మేడ్చల్(Medchal),మల్కాజ్గిరి(Malkajgiri)లోని ఇళ్లలో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. మంత్రి ఇంటితో పాటు ఆయన కుమారుడు, అల్లుడు ఇళ్లలో కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం (Tuesday)తెల్లవారుజాము నుంచి సుమారు 50మంది ఐటీ అధికారుల బృందం ఈసోదాల్లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఆదాయానికి మంచి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరా తీస్తున్నారు. ఐటీ రిటర్న్స్ చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు.
మంత్రి ఇంట్లో ఐటీ రైడ్స్..
గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్కి చెందిన మంత్రులు, నేతల ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఐటీ అధికారులు తనిఖీలు చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే మంత్రి మల్లారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో మల్లారెడ్డి జోరుగా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ గెలుపు కోసం ఎక్కువగా శ్రమించిన నేతల్లో మల్లారెడ్డి ఒకరని చెప్పాలి. అక్కడి స్థానికులకు మందు పార్టీలు ఇచ్చారని..ఆయనే స్వయంగా మందు పోస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మల్లారెడ్డి ఇంట్లో సోదాలు..
అంతే కాదు మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగే ముందు రోజే తెలంగాణలో కాంగ్రెస్ , బీజేపీ ఆటలు సాగవని...2024లో దేశానికి కేసీఆర్ ప్రధాని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కామెంట్స్ చేసిన కొద్ది గంటల్లోనే మంత్రి ఇళ్లపై ఐటీ బృందాలు తనిఖీల పేరుతో ఉక్కిరిబిక్కిరి చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: It act, Mallareddy, Telangana Politics