హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR Chitchat : ఓటుకు 30వేలు ఇచ్చైనా గెలుస్తామనే ధీమాలో BJP నేతలున్నారు .. కాని మునుగోడు ప్రజలు మావైపే ఉన్నారు: KTR

KTR Chitchat : ఓటుకు 30వేలు ఇచ్చైనా గెలుస్తామనే ధీమాలో BJP నేతలున్నారు .. కాని మునుగోడు ప్రజలు మావైపే ఉన్నారు: KTR

Minister KTR File Photo

Minister KTR File Photo

KTR Chitchat: మునుగోడు ఉపఎన్నికల్లో తమ పార్టీ టీఆర్ఎస్‌ విజయం సాధించడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. సర్వేలు, సామాజిక సమీకరణలు, స్థానిక ప్రజల మద్దతు తమ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడుస(Munugodu)ఉపఎన్నికల్లో ధర్మయుద్ధం పేరుతో బీజేపీ(BJP) చేస్తోంది అధర్మయుద్ధంగా అభివర్ణించారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్(KTR). కాంగ్రెస్‌ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి( Komati Reddy Rajagopal Reddy)కేవలం తన స్వలాభం కోసమే బీజేపీలో చేరినట్లుగా తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికల్లో తమ పార్టీ టీఆర్ఎస్‌ విజయం సాధించడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. సర్వేలు, సామాజిక సమీకరణలు, స్థానిక ప్రజల మద్దతు తమ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో కేంద్ర బలగాలను దించాలనుకుంటున్న స్థానిక బీజేపీ నేతలు సాధారణ ఎన్నికలు వస్తే అన్నీ ఎయిర్‌పోర్ట్‌లతో సైన్యాన్ని రంగంలోకి దింపుతారా అని చురకలంటించారు.

Munugodu | Brs: మునుగోడులో టీఆర్ఎస్‌ కాదు బీఆర్ఎస్‌ పేరుతోనే పోటీ .. ఈసీ ఆమోదం కోసం చివరి వరకు ఎదురుచూపు

మునుగోడులో విజయం మాదే:కేటీఆర్

నవంబర్ 3న జరగబోయే మునుగోడు ఉపఎన్నికల్లో ముమ్మాటికి విజయం టీఆర్ఎస్‌దేనన్నారు టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌. సర్వేలు, సామాజిక పరిస్థితులు, స్థానికుల మద్దతు టీఆర్ఎస్‌కే ఉందన్నారు కేటీఆర్ . ఇప్పటి వరకు జరిగిన సర్వేలో తమకే 13శాతం ఓటింగ్ ప్లస్‌లో ఉన్నామన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనే కాంగ్రెస్‌ నేత తన వ్యక్తిగత అవసరాల కోసమే బీజేపీలో చేరారంటూ విమర్శలు చేశారు. సుషి ఇన్‌ఫ్రా అనే తన కంపెనీకి 21వేల కోట్ల కాంట్రాక్టు కోసం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని కేటీఆర్ ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నిక కాంట్రాక్టర్ బలుపుకు మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీగా మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో పేర్కొన్నారు కేటీఆర్.

డబ్బుతో గెలవాలని చూస్తున్నారు..

మునుగోడు ఎన్నికల్లో 500కోట్లు ఖర్చు చేస్తానని ఒక్కో ఓటుకు 30వేల రూపాయలు ఇచ్చైనా గెలుస్తానని కోమటిరెడ్డి అమిత్‌షాకు మాటిచ్చినందుకే బీజేపీ టికెట్ ఇచ్చారని కేటీఆర్‌ విమర్శించారు. మునుగోడులో ప్రజలపై నమ్మకం కంటే డబ్బుతో ఓట్లను కొనగలమనే ధీమాలో బీజేపీ నేతలు ఉన్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఓటమి భయంతోనే అందరి ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నారని...దేశ వ్యాప్తంగా నాయకులు, మీడియా ప్రతినిధులు, విపక్షాల నేతలకు చెందిన 10వేల ఫోన్‌లలో పెగాసెస్‌ ఉందన్నారు. ఈ విషయాల్ని మీడియా ప్రతినిధులు గమనించాలని కోరారు. దేశంలోని చాలా మంది నేతల ఫోన్‌లలో పెగాసెస్‌ ఉందని ..తన ఫోన్‌ కూడా ఉందనే విషయం తనకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. కేవలం మునుగోడు ఉపఎన్నిక కోసం కేంద్ర బలగాల్ని దింపాలని చూస్తున్న స్థానిక బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ చిట్‌ చాట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. 2024సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతలు అన్నీ ఎయిర్‌పోర్టల దగ్గర ఆర్మీని మోహరిస్తారా అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. మునుగోడు నోటిఫికేషన్ వెలువడిన సందర్భంగా నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ విజయం తధ్యమని చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్.

Published by:Siva Nanduri
First published:

Tags: Minister ktr, Munugode Bypoll, Telangana Politics

ఉత్తమ కథలు