హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR: 14 మంది ప్రధానులు కంటే ఎక్కువ అప్పు చేసిన నరేంద్రమోదీ.. మండిపడ్డ కేటీఆర్

KTR: 14 మంది ప్రధానులు కంటే ఎక్కువ అప్పు చేసిన నరేంద్రమోదీ.. మండిపడ్డ కేటీఆర్

కేటీఆర్​, మోదీ (ఫైల్​)

కేటీఆర్​, మోదీ (ఫైల్​)

KTR-Kishan Reddy: తాను చెప్పేది తప్పు అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. కిషన్ రెడ్డి చెప్పేది తప్పైతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తారా ? అని సవాల్ విసిరారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

గత 14 మంది ప్రధానమంత్రుల కంటే ప్రధాని మోదీ(PM Modi) చేసిన అప్పు ఎక్కువ అని తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR)విమర్శించారు. రెండు జాతీయ పార్టీలు అబద్ధాలు, తప్పుడు ప్రచారాలతో ప్రజల ముందుకొస్తున్నాయని ఆరోపించారు. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 3.68 లక్షల కోట్లు వెళ్లాయని.. అందులో రూ. 1.68 లక్షల కోట్లు మాత్రమే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్(Kishan Reddy)డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాను చెప్పేది తప్పు అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. కిషన్ రెడ్డి చెప్పేది తప్పైతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తారా ? అని సవాల్ విసిరారు. కిషన్ రెడ్డికి పదవులకు రాజీనామా చేసే దమ్ము ఎలాగో లేదని.. ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా రాజీనామా చేయని అసమర్ధుడని ఎద్దేవా చేశారు.

తాను చెప్పేది నిజమైతే.. ఆయన కనీసం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్ర‌మాద‌క‌ర‌మైన పార్టీ అని.. దాని ఉచ్చులో యువ‌త ప‌డొద్దని కేటీఆర్ సూచించారు. మ‌తాల మ‌ధ్య పంచాయ‌తీ పెట్ట‌డం బీజేపీ ప‌ని ధ్వ‌జ‌మెత్తారు. కిష‌న్ రెడ్డి లాంటి స‌న్నాసి నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడుతున్నాడని అన్నారు. ఆయ‌న మాట్లాడేవ‌న్ని అబద్ధాలు.. నిల‌దీస్తే ఒక్క స‌మాధానం కూడా చెప్ప‌డ‌ని మండిప‌డ్డారు. బీజేపీ వ‌ల్ల కార్పొరేట్ శ‌క్తులు బాగుప‌డ్డాయని కేటీఆర్ ఆరోపించారు.

ప్రజలు మాత్రం మ‌రింత అగాధంలోకి వెళ్లారని అన్నారు. దేశానికి వేగు చుక్క మ‌న తెలంగాణ అని కేటీఆర్ స్పష్టం చేశారు. హుజుర్‌న‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.రూ. 30 వేల కోట్లతో దామరచర్లలో అల్ట్రా మెగా వ‌ప‌ర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమని చెప్పారు. ఇవాళ‌ ఇంటింటికి సీఎం కేసీఆర్ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు. తెలంగాణలో పల్లె ప్రగతి ద్వారా అద్భుతంగా పల్లెలు బాగు పడ్డాయని... భారతదేశంలోనే తెలంగాణా గ్రామ పంచాయ‌తీలు గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాయని తెలిపారు.

PM Narendra Modi: తెలంగాణ నుంచి ప్రధాని మోదీ పోటీ..? ఆ సీటుపైనే బీజేపీ ఫోకస్..!

kadapa: సంక్రాతి పండుగకి ఆర్టీసీ బంపర్ ఆఫర్స్.. ఏంటో తెలుసా..?

ఉప ఎన్నికల తర్వాత హుజుర్‌నగ‌ర్‌ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందింద‌ని చెప్పారు. ఎవరి వల్ల రాష్ట్రం ముందుకు పోతుందో ప్రజలే గమనించాల‌ని సూచించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారింది.. దేశాన్ని బాగు చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం అని కేటీఆర్ తేల్చిచెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులు రాకపోతే నోరు కూడా మెదపని సన్నాసులు బీజేపీ నాయ‌కులు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.బీజేపీ వల్ల ఒక దళితుడిగాని, ఒక గిరిజన వ్య‌క్తిగాని బాగుపడ్డ దాఖలాలు లేవు అని స్ప‌ష్టం చేశారు.

First published:

Tags: Kishan Reddy, KTR, Telangana

ఉత్తమ కథలు