Home /News /telangana /

TS POLITICS TELANGANA MINISTER KTR ONCE AGAIN CRITICIZED PRIME MINISTER NARENDRA MODI AND BJP CHIEF BANDI SANJAY ON TWITTER PRV

KTR: ప్రధాని నరేంద్ర మోదీ, బండి సంజయ్​లపై మంత్రి కేటీఆర్ మరోసారి​ విమర్శలు.. ఏమన్నారంటే..?

కేటీఆర్​, బండి సంజయ్​ (ఫైల్​ ఫొటోలు)

కేటీఆర్​, బండి సంజయ్​ (ఫైల్​ ఫొటోలు)

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ (Bandi Sanjay) ఆరోపణలపై తెలంగాణ మంత్రి కేటీఆర్​ (KTR) సీరియస్ అయ్యారు. బండి సంజయ్ ఆరోపణలను నిరూపించకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకొంటానని వార్నింగ్ ఇచ్చారు

    చాలారోజులుగా బీజేపీ (BJP), టీఆర్​ఎస్ (TRS)​ పార్టీల మధ్య మాటల యుద్ధం వాడీవేడిగా సాగుతోంది. మొదట్లో బీజేపీ మాత్రమే టీఆర్​ఎస్​ను విమర్శించేది.. అయితే తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతుండటంతో టీఆర్​ఎస్​ కూడా దూకుడు పెంచింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ (Telangana)కు సాయం చేయడం లేదంటూ ఆరోపణలు గుప్పిస్తూ ఉంది. ఇదే కోవలో బీజేపీ నేతలు సైతం కౌంటర్​ ఇస్తున్నారు. అయితే తాజాగా  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ (Bandi Sanjay) ఆరోపణలపై తెలంగాణ మంత్రి కేటీఆర్​ (Telangana Minister KTR) సీరియస్ అయ్యారు. బండి సంజయ్ ఆరోపణలను నిరూపించకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకొంటానని హెచ్చరించారు.  బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలనకు సంబంధించిన వీడియోలను కూడా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. తెలంగాణలో కేటీఆర్ నిర్వాకం వల్ల 27 మంది విద్యార్ధులు మరణించారని ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.



    ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్ధులు చనిపోతే కేసీఆర్​ సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదని కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అయితే ఇంటర్మీడియేట్​ విద్యార్ధుల మృతికి తాను ఎలా కారణమనే విషయమై బండి సంజయ్ ఆధారాలు చూపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై చట్ట పరమైన చర్యలు తీసుకొంటానని కూడా మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.

    ఒక్క మెడిక‌ల్ కాలేజీ కూడా మంజూరు చేయ‌లేద‌ని..

    మరోవైపు  ప్ర‌ధాని నరేంద్ర మోదీ (PM Narendra modi)ని కూడా ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ (Tweet) చేశారు. మోదీ.. మీరు గుజరాత్‌కే కాదు.. భార‌త‌దేశానికి కూడా ప్ర‌ధాని అని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్రానికి ఒక్క మెడిక‌ల్ కాలేజీని కూడా మంజూరు చేయ‌లేద‌న్నారు. కేంద్రం చ‌ర్య‌తో వైద్య విద్య‌కు దూర‌మ‌య్యే యువ‌త ప‌రిస్థితి ఏంట‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ప్ర‌గ‌తిశీల రాష్ట్ర‌మైన తెలంగాణ‌పై వివ‌క్ష ఎందుకు? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.



    గుజ‌రాత్‌ (Gujarat)లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హాజ‌రై ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌తో సంభాషించారు. ఈ సంద‌ర్భంగా ఆయుబ్ ప‌టేల్ అనే వ్య‌క్తిని రేంద్ర మోదీ ని ప‌లుక‌రించ‌గా, త‌న కూతురు ఆశ‌యాన్ని ప్ర‌ధాని ముందుంచారు ఆయ‌న‌. త‌న బిడ్డ భ‌విష్య‌త్‌లో డాక్ట‌ర్ కావాల‌ని కోరుకుంటుంద‌ని తెలిపారు. ఎందుకు డాక్ట‌ర్ కావాల‌నుకుంటున్నావ‌ని ఆయుబ్ ప‌క్క‌నే ఉన్న కూతురిని మోదీ ప్ర‌శ్నించాడు. మా నాన్న అనుభ‌విస్తున్న స‌మ‌స్యే కార‌ణ‌మ‌ని ఆమె చెప్పి బోరున విల‌పించింది.

    న‌రేంద్ర మోదీ భావోద్వేగానికి లోనై.. భ‌విష్య‌త్‌లో ఆమె క‌ల‌ను నెర‌వేర్చేందుకు త‌ప్ప‌కుండా స‌హాయం చేస్తాన‌న్నారు. ఈ వీడియోను కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ.. 8 సంవత్సరాలుగా తెలంగాణకు ఒక్క మెడిక‌ల్ కాలేజీని కూడా మంజూరు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. కేంద్రం చ‌ర్య‌తో వైద్య విద్య‌కు దూర‌మ‌య్యే యువ‌త ప‌రిస్థితి ఏంట‌ని మంత్రి కేటీఆర్ ట్విటర్​లో అడిగారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bandi sanjay, KTR, PM Narendra Modi, Telangana bjp, Telangana Politics, TRS leaders

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు