Home /News /telangana /

TS POLITICS TELANGANA MINISTER KTR FOREIGN TOUR COST RS 13 CRORE SNR

Telangana | Ktr : మంత్రి కేటీఆర్‌ 10 రోజుల ఫారెన్ టూర్‌కి ఖర్చు అన్ని కోట్ల రూపాయలా..!

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Telangana | Ktr : తెలంగాణ ప్రభుత్వ అప్పుల్లో ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే సమయంలో గత నెలల్లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనకు ప్రభుత్వం కేటాయించిన నిధుల కంటే ఆరు రెట్లు అధికంగా ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్టుబడల ఆహ్వానం పేరుతో ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు విపక్ష పార్టీల నేతలు.

ఇంకా చదవండి ...
తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి(Telangana IT and Industry Minister) కేటీఆర్‌(KTR) విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలు చూస్తుంటే తెలంగాణ ధనిక రాష్ట్రమని టీఆర్‌ఎస్‌(TRS) పాలకులు చెబుతున్న మాట వాస్తవమే అనిపిస్తుంది. గత నెలలో మంత్రి కేటీఆర్ విదేశీ టూర్‌(Foreign tour)కి అయిన ఖర్చే అందుకు నిదర్శనమని అధికారిక లెక్కలు చూపిస్తున్నాయి. మంత్రి పర్యటనలకు రాష్ట్ర ఖజానా నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేయడంపై విపక్ష పార్టీల నేతలు వింత వాదనను తెరపైకి తెస్తూ విమర్శలు చేస్తున్నారు.


బడ్టెట్ కంటే 6రెట్లు అధికం..
తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. దేశంలోనే ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ప్రభుత్వానికి పన్నులు, ఇతర మార్గాల ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రధానమైనదిగా అధికారి పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలే చెప్పిన మాట. ఇప్పుడు ఇంకో విషయంలో కూడా తెలంగాణ టాప్‌ స్టేట్‌గా నిలిచిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదాయం సమకూరడంలోనే కాదు ఖర్చులు చేయడంలో కూడా తెలంగాణ టాప్‌ ప్లేసే అంటున్నారు విపక్ష నేతలు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడం కోసం తెలంగాణ ఐటీ మినిస్టర్ చేపట్టిన విదేశీ పర్యటనలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. మే నెలలో కేవలం 10రోజుల పర్యటన కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బు అక్షరాల 13.22కోట్ల రూపాయలని ప్రభుత్వ అధికార లెక్కలు చూపిస్తున్నాయి.

BJP|TRS : జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు మోదీ రాజకీయ సూచనలు .. కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్విదేశీ ఖర్చుపై విపక్షాల విమర్శలు..
మంత్రి కేటీఆర్‌, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్‌తో పాటు మరో 8మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు మే 22నుంచి 26వ తేది వరకు స్విడ్జర్‌ల్యాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు అక్కడే ఉన్నారు. అంతకు ముందు ఐదు రోజుల పాటు యూకేలో పర్యటించారు మంత్రి కేసీఆర్‌ అధికారుల బృందం. ఈ మొత్తం పర్యటనలకు అయిన ఖర్చుకు ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే అవి సరిపోవంటూ 7.80 కోట్ల రూపాయలు అదనంగా కోరారు అధికారులు. ప్రభుత్వం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బడ్జెట్‌ని విడుదల చేసింది. వాటితో కలిపి కేటీఆర్‌ విదేశీ టూర్ ఖర్చు 9.80కోట్లకు చేరుకున్నట్లుగా ఆర్ధికశాఖ ఇప్పటికే ఓ లెక్కను విడుదల చేసింది. అవి కూడా సరిపోలేదంటూ అధికారులు మరో 3.42 కోట్ల రూపాయలు కోరడంతో తెలంగాణ ఆర్ధికశాఖ ఆ నిధుల్ని విడుదల చేసింది. మొత్తంగా చూసుకుంటే కేటీఆర్‌ విదేశీ పర్యటనల కోసం కేవలం 10రోజుల్లో ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బు 13.22కోట్ల రూపాయలని రాష్ట్ర ఆర్ధికశాఖ స్పష్టం చేసింది.

ఇష్టారాజ్యమేనా..
ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉందని.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి ఆర్ధిక వ్యవస్థ పడిపోయిందనే విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ విదేశీ ఖర్చులకు కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయడం ఏమిటని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముంది అనే సామెతను గుర్తు చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Minister ktr, Telangana Politics

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు