హోమ్ /వార్తలు /తెలంగాణ /

BJP|TRS : జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు మోదీ రాజకీయ సూచనలు .. కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్

BJP|TRS : జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు మోదీ రాజకీయ సూచనలు .. కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

BJP|TRS:ప్రధాని నరేంద్ర మోదీ గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. సమావేశంలో వారికి చేసిన సూచనలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. కమ్యూనిటీ సర్వీస్ చేయాలన్న ప్రధాని వ్యాఖ్యలను తప్పుపట్టారు.

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిరకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో అధికారం కోసం విస్తృతంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ముందుగా హైదరాబాద్‌(Hyderabad)ని టార్గెట్ చేస్తూ రాజకీయంగా ఎత్తులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గత జీహెచ్ఎంసీ(Ghmc) ఎన్నికల్లో బీజేపీ(BJP) మెజారిటీ స్థానాలు గెలుచుకోవడంతో కేంద్రం కార్పొరేషన్‌(Corporation‌)స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీNarendra Modi జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో సమావేశమైనట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దేశ ప్రధాని కార్పొరేటర్లతో సమావేశం కావడం...వారికి పరిపాలన పరమైన అంశాలపై దిశానిర్దేశం చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తోంది. రాష్ట్రానికి కేంద్రం తరపున చేయాల్సిన సాయం సంగతి పక్కనపెట్టి ..కేవలం సలహాలు ఇస్తే సరిపోదు అన్నట్లుగా కౌంటర్ ఇస్తోంది.

ఇది చదవండి : మంత్రి కేటీఆర్‌తో తుమ్మల కీలక భేటీ.. హామీ లభించిందా? ఆ ప్రచారానికి తెరపడినట్లేనా?


కార్పొరేటర్లతో ప్రధాని మాట మంచి..

ఢిల్లీలో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం జరిగింది. ఈభేటీలో తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో కార్పొరేటర్లు ఎమ్మెల్యే స్థాయిలో పోరాటం చేయాలని ..విజయం కోసం ప్రతి ఒక్కరూ బాగా పని చేయాలని సూచించారు. సుమారు గంటన్నరపాటు సాగిన సమావేశంలో ప్రతి ఒక్కరి కుటుంబ నేపధ్యం, వ్యక్తిగత వివరాలను పేరు పేరున అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో ప్రజల మద్దతు బీజేపీకే ఎక్కువగా ఉందనే విషయాన్ని కార్పొరేటర్లతో చెప్పారు మోదీ. కార్పొరేటర్లకు పొలిటికల్ లైఫ్ ఇప్పుడే మొదలైనట్లుగా భావించాలని మోదీ సూచించారు కష్టపడి పని చేస్తే భవిష్యత్తులో మంచి నాయకులు అవుతారని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ..వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. కార్పొరేటర్లతో సమావేశం అయిన సందర్భంగా ప్రధాని వారితో గ్రూప్‌ ఫోటో దిగారు. మోదీ , జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌తో పాటు పలువురు తెలంగాణ బీజేపీ నేతలు పాల్గొన్నారు.

కష్టపడితే మంచి ఫ్యూచర్ ఉంది..

జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. భేటీలో వారితో పంచుకున్న విషయాలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలకు సేవ చేసే అంశంపై సూచనలు, సలహాలు ఇచ్చినట్లుగా ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో వారసత్వ దుష్పరిపాలనకు ముగింపు పలకడానికి, రాష్ట్రంలో సుపరిపాలన కోసం బీజేపీ పనిచేస్తుందని ప్రధాని మోదీ ట్వీట్‌లో స్పష్టం చేశారు.

ఉట్టి మాటలు కట్టిపెట్టండి సార్..

ప్రధాని మోదీ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందిచారు. సమావేశంలో వారికి ప్రధాని చేసిన సూచనలను తప్పు పడుతూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నలు సంధించారు. కార్పొరేటర్లు సామాజికసేవ చేయాలని సూచించడంపై మండిపడ్డారు కేటీఆర్ ప్రధాని గారు మీరు నడుపుతున్నది ప్రభుత్వాన్నా లేక స్వచ్ఛంద సంస్థనా అంటూ సెటైర్ వేశారు. అంతే కాదు హైదరాబాద్‌కు విపత్తులు వస్తే కేంద్రం చేసిన సాయం, మెట్రోరైల్ విస్తరణ ప్రస్తావన, మూసీ ప్రక్షాళన అంశాల సంగతి ఏంటని ప్రశ్నించారు. అంతే కాదు తెలంగాణకు మాటలు..గుజరాత్‌కు మూటలునా అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

సెంటర్‌ టు స్టేట్ పాలిటిక్స్..

ప్రధాని మోదీ గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేటర్లతో సమావేశం కావడం చూస్తుంటే ..బీజేపీ ఫోకస్ హైదరాబాద్‌లోని అసెంబ్లీ స్థానాలపై పెట్టినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రానికి సీఎంగా ఉన్న కేసీఆర్‌ కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమికి ఇతర పార్టీలు, రాష్ట్రాల నేతల్ని కలుస్తుంటే ... బీజేపీ మాత్రం గ్రేటర్‌ హైదరాబాద్‌పై గురి పెట్టిందని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.

First published:

Tags: GHMC, Minister ktr, Narendra modi, Telangana

ఉత్తమ కథలు