తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) గవర్నర్ తీరుపై మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారు రాజకీయాలు మాట్లాడటం సరికాదని సూచించారు. రాజ్ భవన్‌ను రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలని గవర్నర్‌కు సూచించారు. గవర్నర్ (Governor) అధికారిక నివాసంలో ఒక పార్టీ నేతల ఫోటోలనే పెట్టుకుంటున్నారని విమర్శించారు. కొద్దిరోజుల క్రితం బ్రిటిష్ కాలం నాటి బానిస చట్టాలు, పోకడలు పోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన కేటీఆర్.. బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకోకపోయినా గవర్నర్ పదవిలో ఉన్నోళ్లు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో ఉన్న వారికి గవర్నర్ పదవి ఇవ్వొద్దని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా మోదీనే చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ నీతులు చెబితే.. ప్రధానమంత్రిగా ఉన్న మోదీ అవే నీతలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. బ్రిటీష్ కాలంలో పెట్టిన రాజ్ పథ్ పేరును కర్తవ్యపథ్‌గా మార్చినప్పుడు అప్పటి గవర్నర్ పదవిని ఎందుకు మార్చడంలేదని ప్రశ్నించారు. గతంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు లేవని.. అక్కడ వైస్రాయ్.. ఇక్కడ గవర్నర్లు ఉండేవారని కేటీఆర్ అన్నారు. ఇక్కడ గవర్నర్లను ఎత్తివేయాలని లేకపోతే ప్రధాని మోదీ వైస్రాయ్‌గా పేరు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. ఇతరులకు నీతులు చెప్పే ముందు ఈ విషయంలో వాళ్లు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఆలోచించుకోవాలని కేటీఆర్ అన్నారు.
మరోవైపు.. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ తరపున లాయర్ దుష్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయని కోర్టుకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో (High Court) లంచ్ మోహన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ సందర్భంగా గవర్నర్‌ను విమర్శించవద్దనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళతానని హైకోర్టులో ప్రభుత్వం తరపు లాయర్ దుష్యంత్ దవే తెలిపారు. అంతముందు ఈ అంశంపై హైకోర్టు విచారణ వాయిదా వేసిన అనంతరం అడ్వకేట్ జనరల్ ఛాంబర్‌లో ప్రభుత్వం తరపున లాయర్ దుష్యంత్ దవే.. గవర్నర్ తరపున లాయర్ అశోక్ రాంపాల్ సుమారు గంటపాటు చర్చలు జరిపారు.
Breaking News: గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం
Warangal: షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్.. కానీ కండిషన్స్ అప్లై...!
ఈ సందర్భంగా గవర్నర్ విషయంలో పలువురు నేతలు చేసిన విమర్శలు, ప్రభుత్వం వ్యవహరించిన తీరును చర్చించారు. దీంతో ఇకపై అలా జరగదని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే(Dushyant Dave) తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందని కోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించినట్టు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరపడంతో.. లంచ్ మోషన్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ దవే కోర్టుకు వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.