Home /News /telangana /

TS POLITICS TELANGANA MINISTER KTR ANSWERED WHO IS HIS FAVORITE LEADER AFTER CM KCR IN TWITTER ASK KTR QUESTIONS PRV

Minister KTR on Twitter: సీఎం కేసీఆర్​ తర్వాత కేటీఆర్​కి నచ్చిన వ్యక్తి ఆయనే అంట.. ట్విటర్​లో పేరు వెల్లడించిన మంత్రి 

మంత్రి కేటీఆర్​

మంత్రి కేటీఆర్​

దేశ రాజకీయాలు, ప్రజల సమస్యలు తదితరాలపై ట్విటర్​నే కేటీఆర్ ఎక్కువ వేదికగా చేసుకుంటారు. ఇదే క్రమంలో ఆదివారం నాడు ASK KTR అనే కార్యక్రమం కింద ట్విట్టర్ లో నెటిజన్లు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు.

    మంత్రి కేటీఆర్​ (Minister KTR) సోషల్​ మీడియాలో యాక్టీవ్​గా ఉంటారు. ఆయన తన భావాలను ట్విటర్​ (Twitter)లో ఎక్కువగా వ్యక్తపరుస్తాడనే విషయం తెలిసిందే. దేశ రాజకీయాలు, ప్రజల సమస్యలు తదితరాలపై ట్విటర్​నే ఆయన ఎక్కువగా వేదికగా చేసుకుంటారు. ఇదే క్రమంలో ఆదివారం నాడు ASK KTR అనే కార్యక్రమం కింద ట్విట్టర్ లో నెటిజన్లు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ (KTR)  సమాధానం ఇచ్చారు.  కేసీఆర్ కాకుండా తనకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం (APJ Abdul kalam) ఇష్టమైన నేత అని కేటీఆర్ బదులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మూడోసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​  (KTR) ధీమాను వ్యక్తం చేశారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (In the Telangana Assembly elections) కాంగ్రెస్, బీజేపీ తో పాటు ఇతర పార్టీలు తమకు పోటీ అని కేటీఆర్​ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రజల ఆస్తులను అమ్ముకుంటుందని ఈ సందర్భంగా కేటీఆర్​ విమర్శించారు. కేంద్రంపై రాష్ట్రాలు కలిసికట్టుగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్​ పిలుపునిచ్చారు. ఇక Hyderabad లో క్రికెట్ మ్యాచ్ల నిర్వహణపై ఓ నెటిజన్​ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆ విషయం గురించి సౌరబ్​ గంగూలీ, జై షాలను అడగాలని కేటీఆర్​ తెలిపారు.



    హైద్రాబాద్ కు ఐటీఐఆర్ ను NDA ప్రభుత్వం ఇవ్వాలన్నారు తెలుగు మాదిరిగానే ఉర్ధూ కూడా భారత రాజ్యాంగం ద్వారా అధికారిక భాషగా గుర్తించిందని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు కూడా యూపీఎస్‌సీ తో సహా ఉర్దూలో కూడా రిక్రూట్ మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. గ్రూప్ వన్ పరీక్షలను ఉర్దూలో నిర్వహించే విషయమై నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. అంతేకాదు మతోన్మాదుల ప్రభావానికి గురికావొద్దని ఆయన కోరారు.



    ఆమేథీలో గెలుపుపై దృష్టి పెట్టాలని..

    హైదరాబాద్​ను భారతీయ సినిమా హబ్ (Hub of indian Cinema) గా మార్చడానికి తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీకి ప్రపంచస్థాయి ఫిల్మ్ స్కూల్ యూనివర్శిటీ అవసరమని ఒక నెటిజన్ (Netizen) సూచించారు. ఈ విషయమై సీఎం (Cm KCR) సార్ పనిచేస్తున్నారని కేటీఆర్ సమాధానమిచ్చారు. కరోనా కారణంగా ఈ ప్రణాళికలు ఆలస్యమయ్యాయన్నారు. ఆమేథీలో గెలుపుపై దృష్టి పెట్టాలని ఓ నెటిజన్ రాహుల్ గాంధీకి ఇచ్చే సలహా ఏమిటని ప్రశ్నిస్తే కేటీఆర్ సమాధానం ఇచ్చారు. పెట్రోల్​ డీజీల్ ధరలు రూ. 100 దాటిన విషయమై ఓ నెటిజన్ ప్రశ్నకు కేటీఆర్ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ఇండియాను పెట్రోల్, డీజీల్ ధరల్లో నంబర్​ 1  స్థానంలో నిలుపుతారని సెటైర్లు వేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, KTR, Tweets

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు