హోమ్ /వార్తలు /తెలంగాణ /

Free coaching: నిరుద్యోగ యువతకు మంత్రి పెద్దసాయం..ఉద్యోగం సాధించి తలెత్తుకోవాలన్న హరీష్‌రావు

Free coaching: నిరుద్యోగ యువతకు మంత్రి పెద్దసాయం..ఉద్యోగం సాధించి తలెత్తుకోవాలన్న హరీష్‌రావు

(భవితకు రక్షణ..! సాధనకు శిక్షణ!)

(భవితకు రక్షణ..! సాధనకు శిక్షణ!)

Siddipeta:ఉద్యోగం సాధించాలనుకునే వారి తపన, పట్టుదలను ప్రోత్సహిస్తున్నారు తెలంగాణ ఆర్ధిక, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు. సొంత నిధులతో పేద, మధ్యతరగతి నిరుద్యోగ యువత కోసం సిద్ధిపేటలో కేసీఆర్ టెట్‌, డీఎస్సీ ఫ్రీ కోచింగ్‌ క్లాసులను ప్రారంభించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మంత్రి హరీష్‌రావు.

ఇంకా చదవండి ...

  1. (P.Srinivas,New18,Medak)
  2. తెలంగాణ(Telangana)లో సుమారు లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ (Notification)జారీ చేసింది. నిరుద్యోగ యువత, పేద , మధ్యతరగతి విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేందుకు తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు (Harish Rao)అందుకు తగిన సహాయం చేస్తున్నారు. సిద్దిపేట (Siddipeta)జిల్లాలో ఆర్ధికంగా వెనుబడి ఉద్యోగవకాశాలు అందిపుచ్చుకోలేని వాళ్ల కోసం తన సొంత ఖర్చులతో ఫ్రీ కోచింగ్‌ సెంటర్‌ని ప్రారంభించారు. పొన్నాల (Ponnala)టీఆర్‌ఎస్‌ భవన్‌(TRS bhavan)లో భవితకు రక్షణ..! సాధనకు శిక్షణ అనే మంచి సంకల్పంతో సీఎం కేసీఆర్ టెట్ ఉచిత శిక్షణ, భోజనం తరగతు(kcr tet,dsc training classes)లను ప్రారంభించారు మంత్రి. ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వం డోర్లు తెరిస్తే వాటిని సాకారం చేసుకునేందుకు తగిన ప్రోత్సాహం మంత్రి అందిస్తున్నారు. పోటీ పరీక్షలకు దూరాబారాలు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసుకొని కోచింగ్ తీసుకునే ఇబ్బందులు తలెత్తకుండా టెట్‌, డీఎస్సీ శిక్షణ తరగతులు, వసతి కల్పన,ఉచిత భోజన వంటి సౌకర్యాలను స్వయంగా ఏర్పాటు చేశారు. ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్‌ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు స్థానిక యువతకు ఎంతో ఉపయోగకరమైన మాటలు చెప్పారు. ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదివితే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందని నిరుద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఉచితం అనే భావన మనుసులోంచి తీసేసి సిన్సియర్‌గా చదివితే భవిష్యత్తు బంగారుమయం అవుతుందన్నారు. ఉద్యోగ సాధన ఇప్పుడు కష్టంగా ఉన్నప్పటికి ఒక్కసారి లక్ష్యాన్ని నెరవేర్చుకుంటే జీవితాంతం సుఖమయం అని చెప్పారు హరీష్‌రావు. కేవలం స్థానిక యువత ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగాలు చేజార్చుకోకూడదన్న ఆలోచనతో తన సొంత డబ్బులతో ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని దాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగం సాధించినప్పుడే ఈ శిక్షణ శిబిరానికి సార్ధకత..మాకు నిజమైన ప్రోత్సాహమన్నారు మంత్రి హరీష్‌రావు.

  మంత్రి కాదు మార్గదర్శకుడు..

  ఉద్యోగం సంపాధించాలన్న లక్ష్యాన్ని మాత్రమే మనసులో పెట్టుకొని ఇష్టంతో చదవాలని సూచించారు మంత్రి. తలదించుకొని చదివితే జీవితాంతం తల ఎత్తుకునేలా బ్రతుకుతారని విద్యార్ధులు, నిరుద్యోగ యువతలో స్పూర్తిని నింపే విషయాలను వెల్లడించారు. హైదరాబాదు అవనిగడ్డ కంటే అద్భుతంగా ఇక్కడ శిక్షణ ఏర్పాటు చేశామన్న మంత్రి ఇప్పుడు 600 మందికి టెట్ శిక్షణ తరగతులు ప్రారంభించినట్లు.. చెప్పారు. ఇక్కడున్న వాళ్లంతా తన కుటుంబ సభ్యులన్న మంత్రి తన తపన సిద్దిపేట ప్రాంత వాసులకు ఇబ్బందులు కలగొద్దని శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. జోనల్ వ్యవస్థ తెచ్చి, కొత్త జిల్లా మధ్య విభజన సందర్భంగా లాక్ పెట్టామని, అన్ని జిల్లాల్లో సమానంగా ఖాళీలు పెట్టామని, సీనియర్ వాళ్లకు స్థానికంగా అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు.

  నిరుద్యోగ యువతకు సాయం..

  కేవలం ఉపాధ్యాయ ఉద్యోగం కోసం కాకుండా, ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయని, వాటిపై దృష్టి పెట్టాలని, ఇందుకోసం ఈ టెట్ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యోగాలలో ఇంటర్వ్యూల పేరిట మోసం జరుగుతుందని, మెరిట్ కే పట్టం కట్టాలని సీఎం ఆలోచన చేశారని, ఉద్యోగ పరీక్షల అనంతరం ఇంటర్వ్యూ ఎత్తివేసి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇద్దామని సీఎం కేసీఆర్ సూచన చేసినట్లు తెలిపారు. 2023 నుంచి ఉద్యోగ క్యాలెండర్ నిర్వహణ ఉంటుందని చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా మెరిట్ ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా ఒత్తిడి తెస్తామన్నారు మంత్రి హరీష్‌రావు.

  సొంత ఖర్చులతో ఫ్రీ కోచింగ్‌ క్లాసెస్..

  ఉచిత శిక్షణ శిబిరం 2016లోనే సిద్దిపేటలో మొదలు పెట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. వెయ్యి మందికి టెట్ శిక్షణలో 800 మంది అర్హత, పోలీసు ఉద్యోగాలలో 608 మంది శిక్షణలో 224 మంది కానిస్టేబుళ్లు, 8 మంది సబ్ ఇన్స్ పెక్టర్లు, గ్రూప్స్ పరీక్షకు హాజరైన 350 మందికి శిక్షణలో వివిధ శాఖలలో 22 మంది ఉద్యోగాలు, డీఎస్సీ శిక్షణలో 300 మందిలో 66 మంది అర్హత పొందారని.. వారంతా సుదూర ప్రాంతం వెళ్ళలేదని చెప్పుకొచ్చారు. అందరికీ అవకాశాలు కల్పించాలనే రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు తెచ్చామని, విపక్ష నేతలతో మాటలు పడ్డామన్నారు. ఉద్యోగ సాధనలో నిమగ్నమవ్వాలని వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్‌స్టాగ్రామ్ వంటి సోషల్‌ మీడియాను పూర్తిగా పక్కనపెట్టి భవిష్యత్తుపై దృష్టి పెట్టమని సలహా ఇచ్చారు మంత్రి హరీష్‌రావు. నూతన శిక్షణ తరగతుల ప్రారంభంలో గతంలో శిక్షణ పొంది ఉద్యోగాలు పొందిన కొందరు మంత్రి చేసిన మేలుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హరీష్‌రావు అందిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని అందరూ ఉపయోగించుకొని పేరు తేవాలని కోరారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Minister harishrao, Siddipeta

  ఉత్తమ కథలు