Home /News /telangana /

TS POLITICS TELANGANA MINISTER HARISH RAO EXPRESSED DISSATISFACTION THAT UNION MINISTERS WERE ALSO LYING IN PARLIAMENT PRV

Harish rao about Union Ministers: కేంద్రం తీరుపై మంత్రి హరీశ్​ రావు అసంతృప్తి.. అక్కడ కూడా అబద్దాలు చెబుతున్నారని అసహనం

మంత్రి హరీశ్ రావు(ఫైల్ ఫొటో)

మంత్రి హరీశ్ రావు(ఫైల్ ఫొటో)

ధాన్యం కొనుగోలు విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ టీఆర్‌ఎస్ నాయ‌కులు విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ యోచిస్తోంది. ఏప్రిల్ 11న ఢిల్లీలో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు నిరసన చేపట్టనున్నారు.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో ధాన్యం కొనుగోలు (Grain buy) అంశం రోజురోజుకీ జఠిలమవుతోందే తప్ప ఓ కొలిక్కి రావడం లేదు. కొనాలని టీఆర్​ఎస్​ ప్రభుత్వం (TRS Government) డిమాండ్​ చేస్తుంటే కొనబోమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భీష్మించుకు కూర్చుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ‌పై వివ‌క్ష‌, ధాన్యం కొనుగోలు విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ నాయ‌కులు (TRS leaders) విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ యోచిస్తోంది. ఏప్రిల్ 11న ఢిల్లీలో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు నిరసన చేపట్టనున్నారు.

    కేంద్రం ముందుకు వచ్చేంత వరకు నిరసన..

    మరోవైపు తెలంగాణ (Telangana) నుంచి వరి ధాన్యం కొనుగోలు (paddy procurement) కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ప్రతి వరి గింజను కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చేంత వరకు తమ నిరసనను కొనసాగిస్తామని టీఆర్‌ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రబీ సీజన్‌లో రాష్ట్రం నుంచి పూర్తి స్థాయిలో వరిధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర శాసనసభ్యులు జిల్లా కేంద్రంలో నిరసనలకు నాయకత్వం వహించారు.

    పార్లమెంట్‌లో అబద్ధాలు చెప్పిందని..

    టీఆర్​ఎస్​ నిరసనలో భాగంగా సిద్దిపేట (Siddipet)లో  మంత్రి టి.హరీశ్‌రావు (Minister Harish rao) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) తీరుపై నిరసన జరిగింది. తెలంగాణలో పండే వరి ధాన్యాన్ని సేకరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఈ సందర్భంగా హరీశ్​ అ న్నారు. పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి చేస్తున్నట్టుగానే తెలంగాణ నుంచి కూడా మొత్తం నిల్వలను ఎత్తివేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి కేంద్రం ముందుకు రావాలని ఆయన డిమాండ్​ చేశారు. గతేడాది కేంద్రం బియ్యాన్ని ఎగుమతి చేసిందని, అయితే ఎగుమతులు జరగలేదని పార్లమెంట్‌లో అబద్ధాలు చెప్పిందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కేంద్రంలోని మంత్రులు ప్రతి అంశంపై పార్లమెంటు (Parliament)లో అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్​ అన్నారు.

    నల్గొండలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, హోంమంత్రి మెహమూద్‌ అలీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ అంశంపై టీఆర్‌ఎస్‌ వరుసగా రెండో రోజు నిరసనలు చేపట్టింది. బుధవారం ముంబై, నాగ్‌పూర్‌, బెంగళూరు, విజయవాడల జాతీయ రహదారులపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు.

    మరోవైపు సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన ధర్నాలో కేటీఆర్​ ( KTR )పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కేంద్ర మంత్రులు వెటకారం చేస్తున్నారని కేటీఆర్​ మండిపడ్డారు. ఉప్పుడు బియ్యం ఎందుకు కొనరని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. విదేశాలకు బాయిల్డ్ రైస్ ను కేంద్రం ఎగుమతి చేస్తుందని తెలిపారు. ఈ విషయమై రాజ్యసభ (Rajyasabha )ను కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. ఈ విషయమై తమ పార్టీ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Central governmennt, Harish Rao, PADDY PROCUREMENT, Parliament, Siddipet

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు