TS POLITICS TELANGANA MINISTER HARISH RAO DESCRIBED UNION HOME MINISTER AMIT SHAH AS A LIAR SHAH PRV
Harish rao| Amit shah: అమిత్ షాకు అల్జీమర్స్ వ్యాధి ఏమైనా ఉందా? కేంద్ర హోం మంత్రిపై హరీశ్ రావు సెటైర్లు
హరీశ్ రావు (ఫైల్)
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పచ్చి అబద్దాలు మాట్లాడారని అన్నారు. ఆయన అమిత్ షా కాదని.. అబద్దాల బాద్ షా అని విమర్శించారు
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah)పై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు (Telangana Minister Harish Rao) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పచ్చి అబద్దాలు మాట్లాడారని అన్నారు. ఆయన అమిత్ షా కాదని.. అబద్దాల బాద్ షా అని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డానేమో అబద్ధాలకు అడ్డగా, అమిత్ షానేమో అబద్ధాలకు బాద్ షాగా నిరూపించుకున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. అమిత్ షాకు అల్జీమర్స్ వ్యాధి ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదని చెప్పారు. ఇవ్వని నిధులు ఇచ్చామని, అమలు కాని పథకాలను అమలు చేస్తున్నామని.. అమిత్ షా పచ్చి అబద్దాలు (Lies) చెప్పారని మండిపడ్డారు.
అమిత్ షా అబద్ధాల పురాణం చదివారు..
‘‘తెలంగాణ (Telangana)కు నిధుల కేటాయింపులపై అర్ధ గంటలోనే ఇద్దరు కేంద్ర మంత్రులు పచ్చి అబద్ధాలు ఆడారు. ముందుగా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రూ. 30 వేల కోట్లు ఇచ్చామన్నారు. అర్ధ గంట తర్వాత మాట్లాడిన అమిత్ షానేమో రూ. 18 వేల కోట్లు ఇచ్చామన్నారు. ఇందులో ఏ కేంద్ర మంత్రిది నిజం. ఇద్దరిలో ఎవర్నీ నమ్మాలి. కిషన్ రెడ్డి మాట నిజమా? అమిత్ షా మాట నిజమా? నిన్న అమిత్ షా అబద్ధాల పురాణం చదివారు ’’ హరీశ్‌రావు మండిపడ్డారు.
మంత్రి మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలు కావడం లేదని అమిత్ షా పచ్చి అబద్ధం మాట్లాడారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలవుతుందని పార్లమెంట్లో కేంద్ర మంత్రి చెప్పారని మంత్రి గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలవుతుందా? అని 2022, ఫిబ్రవరి 4 న ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సమాధానం చెప్పారు. 2021, మే 21 నుంచి ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలవుతోందని కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారని చెప్పారు హరీశ్.
అమిత్ షాకు అల్జీమర్స్ వ్యాధి ఏమైనా ఉందా..?
టీఆర్ఎస్ పార్టీ 370 ఆర్టికల్‌కు మజ్లిస్ పార్టీకి భయపడి మద్దతు ఇవ్వలేదని అమిత్ షా అన్నారు. అసలు అమిత్ షాకు అల్జీమర్స్ వ్యాధి (alzheimer disease) ఏమైనా ఉందా? అని అనుమానం వస్తోందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు టీఆర్ఎస్ పార్టీ బహిరంగంగా మద్దతు తెలిపిందన్నారు. పార్లమెంట్లో నిర్వహించిన ఓటింగ్‌లో కూడా పాల్గొన్నది. మజ్లిస్ పార్టీకి భయపడి ఆర్టికల్ 370ని వ్యతిరేకించిందని అమిత్ షా పచ్చి అబద్ధం మాట్లాడారని అన్నారు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు స్పందించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయలేదని అమిత్ షా అన్నారు. కేసీఆర్ స్వయంగా హైదరాబాద్ నలుమూలలా నాలుగు ఆస్పత్రులను పెట్టాలని నిర్ణయించారని హరీశ్‌రావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథకు రూ. 2500 కోట్లు ఇచ్చామని అమిత్ షా చెప్పారు. ఇది కూడా పచ్చి అబద్ధం. ఈ పథకానికి కేంద్రం రూ. 2 కూడా ఇవ్వలేదు. మిషన్ భగీరథకు రూ. 2 ఇచ్చి ఉంటే ఆధారాలు చూపించాలని రాష్ట్ర బీజేపీ నేతలను డిమాండ్ చేశారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.