Home /News /telangana /

TS POLITICS TELANGANA MINISTER HARISH RAO COUNTER TO UNION MINISTER PIYUSH GOYAL COMMENTS ON PADDY PROCUREMENT AK

కశ్మీర్‌లో వరి.. తెలంగాణలో ఆపిల్స్ అంటే కుదురుతుందా ?.. కేంద్రానికి Harish Rao కౌంటర్

హరీశ్​ రావు (ఫైల్​)

హరీశ్​ రావు (ఫైల్​)

ఆనాడు సమైక్య పాలకుల భాషనే పీయూష్ గోయల్ ఇపుడు మాట్లాడుతున్నాడని హరీశ్ రావు ఆరోపించారు. స్థానిక బీజేపీ నేతలు ప్రతి గింజను కేంద్రం కొంటుంది వరి వేయాలి అన్నారని.. వారంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

    తెలంగాణ వాతావరణ పరిస్థితులు వేరు పంజాబ్ పరిస్థితులు వేరు అని తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అన్నారు. పంజాబ్ లో వరి విత్తనాలు ఉత్పత్తి చేయమంటే చేస్తారా ? అని ప్రశ్నించారు. దేశంలోని 80 శాతం విత్తనాలు తెలంగాణలో ఉత్పత్తి అవుతాయని అన్నారు. తెలంగాణ లో ఆపిల్స్ పండించమని కాశ్మీర్లో వరి పండించాలని అంటే కుదురుతుందా ? అని కేంద్రానికి కౌంటర్ ఇచ్చారు. బాయిల్డ్ రైస్‌పై మెడ మీద కత్తి పెట్టి ఒప్పందం చేసుకున్నారని.. వ్యవసాయ చట్టాలు రద్దు చేసినట్టే బాయిల్డ్ రైస్ ఒప్పందాన్ని రద్దు చేసుకోలేరా ? అని ప్రశ్నించారు. బీజేపీదీ బెదిరింపు సంస్కృతి అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) మరోసారి తెలంగాణ రైతులను ప్రజలను పార్లమెంటు సాక్షిగా అవమానించారని హరీశ్ రావు అవమానించారు.

    తమను ఏమైనా అంటే భరిస్తామని.. కానీ రైతులనంటే పడేది లేదని కేసీఆర్(KCR) చాలా సార్లు చెప్పారని హరీశ్ రావు గుర్తు చేశారు. నూకలు తినాలని మా మంత్రులు, ఎంపీలతో హేళనగా పీయూష్... ఇప్పుడు మరోసారి అహంకారాన్ని ప్రదర్శించారు. ఆడిటర్‌గా పని చేసిన పీయూష్‌కు రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని అన్నారు. అర్థం చేసుకోని వాళ్ళకు ఏం చెబుతామని పీయూష్ అహంకారాన్ని వెళ్ల గక్కారని హరీశ్ రావు మండిపడ్డారు. అర్థం చేసుకోంది పీయూష్ గోయెలే అని అన్నారు. తెలంగాణకు వస్తే పీయూష్ గోయల్‌కు తమ ప్రభుత్వం రైతులకేమి చేస్తుందో తెలుస్తుందని కామెంట్ చేశారు.

    రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని అన్నారు. కాళేశ్వరం మూడున్నారేళ్లలో పూర్తి చేశామని చెప్పారు. పీయూష్ తన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పీయూష్ గోయల్‌గా అడగటం లేదని.. కేంద్రమంత్రివి కాబట్టే అడుగుతున్నామని అన్నారు. ఆయన వ్యాపారిలా మాట్లాడటం సరికాదని అన్నారు. ధమ్కీలు తాము ఇవ్వడం లేదని.. తాము ప్రజలు కోసం మాట్లాడుతున్నామని చెప్పారు. అరెస్టులు చేస్తాం.. జైల్లో పెడతాం అని ధమ్కీలు ఇస్తున్నారని మండిపడ్డారు. ధమ్కీలు ఇచ్చే సంస్కృతి బీజేపీది అని ఆరోపించారు. తెలంగాణ రైతుల కోసం అడిగితే ధమ్కీ అంటావా ? ప్రశ్నించారు. అవసరమైతే నూకలు కూడా తింటామని.. కానీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు.

    Etela Rajendar| KCR: ఈటల విషయంలో కేసీఆర్ కోరిక తీరదా ?.. టీఆర్ఎస్ నేతలే అందుకు కారణమా ?

    KCR| Telangana: జగన్ బాటలో కేసీఆర్.. త్వరలోనే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. అదే జరిగితే.. ఆ ఆలోచన లేనట్టే ?

    ఆనాడు సమైక్య పాలకుల భాషనే పీయూష్ గోయల్ ఇపుడు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. స్థానిక బీజేపీ నేతలు ప్రతి గింజను కేంద్రం కొంటుంది వరి వేయాలి అన్నారని.. వారంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారని అన్నారు. ఎగుమతులకు wto నిబంధనలు అడ్డంకి అని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఆ అడ్డంకులను ఎందుకు తొలగించలేదని.. ఇన్నాళ్లు ఏం చేశారని ఆరోపించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం పోయి వ్యయాన్ని రెట్టింపు చేశారని హరీశ్ రావు దుయ్యబట్టారు. అసలు బీజేపీ ఎవరి పక్షమని ప్రశ్నించారు. పీయూష్ కార్పొరేట్లకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నేతలు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన పీయూష్ వైపు ఉంటారా ? లేకవడ్లు కొనమంటున్న రైతుల ఉంటారా ? తేల్చుకోవాలని ప్రశ్నించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Harish Rao, Telangana

    తదుపరి వార్తలు