హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఈడీ, ఐటీ దాడులపై స్పందించిన తెలంగాణ మంత్రి.. ఏమన్నారంటే..

Telangana: ఈడీ, ఐటీ దాడులపై స్పందించిన తెలంగాణ మంత్రి.. ఏమన్నారంటే..

మంత్రి గంగుల కమలాకర్ (ఫైల్ ఫోటో)

మంత్రి గంగుల కమలాకర్ (ఫైల్ ఫోటో)

Telangana News: మంత్రి గంగుల నివాసంలో ఈడీ, ఐటీ సోదాలు ముగిశాయి. పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంగుల బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తన కంపెనీలపై ఈడీ, ఐటీ దాడులపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar).. హైదరాబాద్ నుంచి కరీంనగర్(Karimnagar) బయలుదేరారు. ఈడీకి సహకరించేందుకే దుబాయ్(Dubai) నుంచి తిరిగి వచ్చానని అన్నారు. సోదాల కోసం ఇంటి తాళాలు పగలగొట్టమని చెప్పింది తానేనని మంత్రి గంగుల తెలిపారు. సోదాల్లో నగదు ఎంత నగదు చేశారో వాళ్లకే తెలియాలని వ్యాఖ్యానించారు. మైనింగ్ రాయల్టీ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని.. ఈ విషయంలో ఈడీకి ఏం సంబంధమో అర్థంకావడం లేదని తెలిపారు. 31 ఏళ్ల నుంచి గ్రానైట్ వ్యాపారం చేస్తున్నామని.. గ్రానైట్ సంస్థలపై చాలాసార్లు ఫిర్యాదు చేశారు. అనేకసార్లు దర్యాప్తు చేశారని చెప్పారు. తాము ఫెమా నిబంధనలను ఉల్లంఘించలేదని వివరించారు.

మరోవైపు మంత్రి గంగుల నివాసంలో ఈడీ, ఐటీ సోదాలు ముగిశాయి. పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంగుల బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. రేపు కూడా గ్రానైట్ వ్యాపారుల ఆఫీసుల్లో ఈడీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.

అంతకుముందు తెలంగాణలో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు చేస్తున్న ఆదాయపన్ను శాఖ(ఐటీ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు...అందులో భాగంగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటిలోనూ సోదాలు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మంత్రి గంగుల కమలాకర్ ఇంటిలోనూ ఈ సంస్థల అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లోని గంగుల ఇంటి తాళాలు పగులగొట్టి మరీ అధికారులు ఆయన ఇంటిలోకి ప్రవేశించారు.

PM Modi| Telangana: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. మరోసారి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ .. రచ్చ జరుగుతుందా ?

KCR-BJP: బీజేపీకి భిన్నమైన కేసీఆర్ ప్లాన్.. 2023 ఎన్నికల్లోనూ ఇదే వ్యూహమా ?

కరీంనగర్ లోని గంగుల ఇంటితో పాటు మంకమ్మతోటలోని కమలాకర్ కు చెందిన శ్వేత గ్రానైట్స్, కమాన్ ప్రాంతంలోని మహావీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్ లో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. గ్రానైట్ ఎగుమతుల్లో భాగంగా ఆయా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలతో ఇదివరకే తెలంగాణకు చెందిన 8 సంస్థలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆదాయపన్ను శాఖ అధికారులతో కలిసి ఈడీ దాడులు చేస్తుండటం గమనార్హం.

First published:

Tags: Minister gangula kamalakar, Telangana