ప్రొఫెసర్ కోదండరామ్ సారథ్యంలోని తెలంగాణ జనసమితి మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కోదండరామ్.. తమ పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించారు. పల్లె వినయ్ గౌడ్ టీజేఎస్(Telangana JanaSamiti) తరపున మునుగోడులో పోటీ చేయనున్నట్టు వెల్లడించారు. టీఆర్ఎస్, బీజేపీ ఆధిపత్య పోరు మునుగోడు(Munugodu) ఎన్నికకు కారణమైందని ఆయన విమర్శించారు. తెలంగాణ అస్తిత్వాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. భారీ అవినీతికి పాల్పడి ఆస్తులు కూటబెట్టుకున్నారని ఆరోపించారు. మునుగోడులో తమ పార్టీ బరిలోకి దిగే ఆలోచన ఉందని కోదండరామ్(Kodandaram) కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా గాయకుడు గద్దర్‌ను నిలబెడితే ఆయనకు టీజేఎస్ మద్దతు ఇస్తుందని కోదండరామ్ అన్నారు. లేకపోతే ఈ ఉప ఎన్నికల్లో తమ పార్టీ నుంచి వేరే అభ్యర్థి పోటీలో ఉంటారని తెలిపారు.
అయితే గద్దర్ కేఏపాల్ పార్టీ తరపున పోటీ చేస్తుండటంతో.. టీజేఎస్ తరపున సొంతంగా అభ్యర్థిని ప్రకటించాలని భావించిన కోదండరామ్.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నిజానికి కోదండరామ్ మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ జరిగింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనతో సంప్రదింపులు కూడా జరిపారనే వార్తలు వచ్చాయి. కానీ కోదండరామ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు.
ఒకవేళ కాంగ్రెస్‌కు వామపక్షాలు మద్దతు ఇస్తే.. కోదండరామ్ కూడా వారితో కలిసి ముందుకు సాగే అవకాశం ఉండేదని.. కానీ వామపక్షాలు టీఆర్ఎస్ వైపు వెళ్లిపోవడంతో కోదండరామ్ కూడా మనసు మార్చుకుని ఉంటారని పలువురు భావిస్తున్నారు. అయితే మునుగోడులో పోటీ చేయడం ద్వారా భవిష్యత్తులోనూ తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయడం లేదా ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని కోదండరామ్ సంకేతాలు ఇచ్చారేమో అనే విశ్లేషణలు కూడా వినిపిస్తన్నాయి. కాంగ్రెస్‌లో టీజేఎస్‌ను విలీనం చేయాలని రేవంత్ రెడ్డి గతంలో కోదండరామ్‌ను కోరినట్టు ప్రచారం జరిగింది.
Telangana: తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రెండు వారాల గడువు..
మునుగోడులో కలకలం..కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ను తగలబెట్టిన దుండగులు..టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం
అలా చేస్తే కాంగ్రెస్‌లో ప్రాధాన్యత ఇస్తామని ఆయనకు హామీ ఇస్తామని ఆయన పార్టీ అధిష్టానం నుంచే హామీ ఇప్పించారని సమాచారం. అయితే కోదండరామ్ మాత్రం ఇందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఇక టీజేఎస్‌ను ఆప్‌లో విలీనం చేయించడం ద్వారా ఆయనను తెలంగాణలో ఆప్ నాయకుడిగా అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ టీమ్ భావించినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని కోదండరామ్ కూడా అంగీకరించారు. కానీ ఎందుకో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో మళ్లీ టీజేఎస్‌తో రాజకీయంగా ముందుకు సాగాలని కోదండరామ్ నిర్ణయించుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kodandaram, Munugodu By Election