ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రాణించడం అంత ఈజీ కాదు. అందులోనూ ఓ రాజకీయ పార్టీని నడపడం చాలా కష్టసాధ్యమైన పని. ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు సైతం రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి.. ఆ తరువాత దానిని నడపలేక చతికలబడ్డారు. అనేక మంది నాయకుల తరహాలోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్. తెలంగాణ జనసమితి పేరుతో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన కోదండరామ్.. (Kodandaram) ఆయనను ఓడించేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమిలో చేరారు. కానీ ఆ కూటమి రాజకీయాల కారణంగా ఆయనకే పోటీ చేసే అవకాశం రాలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress)సారథ్యంలోని కూటమి ఓడిపోవడంతో.. కోదండరామ్ సారథ్యంలోని పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
టీజేఎస్ అంటే కేవలం కోదండరామ్ ఒక్కరే అన్నట్టుగా ఆ పార్టీ పరిస్థితి ఉంది. నిజానికి తెలంగాణ ఉద్యమంలో వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలతో ఉద్యమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు కోదండరామ్. ఆ సమయంలో కొన్నిసార్లు కేసీఆర్ (KCR) ఆలోచనలతో ఆయన విభేదించారు కూడా. అయినా తాను అనుకున్న పని చేయడంలో విజయం సాధించారు. ఉద్యమంలో ఆ రకంగా వ్యవహరించిన కోదండరామ్.. రాజకీయాల్లో మాత్రం తాను అనుకున్నది సాధించలేకపోతున్నారు.
నిజానికి కోదండరామ్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయించాలని పలువురు ప్రయత్నించారు. ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేశారనే వార్తలు వచ్చాయి. కానీ కోదండరామ్ మాత్రం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే విషయంలో అంత సుముఖత వ్యక్తం చేయలేదని వార్తలు వచ్చాయి. ఇక దేశంలో సంచలనాలు సృష్టిస్తున్న ఆప్‌ను తెలంగాణలో విస్తరించాలని భావించిన ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. తెలంగాణలోని కోదండరామ్ పార్టీని ఆప్‌లో విలీనం చేసి తమ పార్టీకి సారథ్యం వహించాలని కోరినట్టు ప్రచారం జరిగింది.
Telangana : పుట్టి, పెరిగింది ఏజెన్సీ ప్రాంతంలో .. ఇప్పుడు స్టేట్ విమెన్ వాలీబాల్ టీం కోచ్
Telangana | Kcr kit: బిడ్డను కన్న తల్లులకు కేసీఆర్ కిట్టే ఇస్తారా .. మరి నగదు సంగతేంటి..?
కానీ ఈ ప్రతిపాదనకు కూడా కోదండరామ్ నో చెప్పినట్టు సమాచారం. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఏదో సాధించాలని భావిస్తున్న కోదండరామ్.. ఆ దిశగా ఆచరణ సాధ్యమైన అడుగులు మాత్రం వేయడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కేసీఆర్‌తో స్నేహం చేయడానికి కేజ్రీవాల్ ఓకే చెప్పడంతో.. ఇక ఆప్ తెలంగాణలో విస్తరించడం దాదాపు లేనట్టే అని తెలుస్తోంది. దీంతో కోదండరామ్ మళ్లీ కాంగ్రెస్‌తో కలిసి రాజకీయాల్లో ముందుకు సాగడం మినహా.. ఆయనకు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని కొందరు చర్చించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Congress, Kodandaram, Telangana