హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR | CORONA : తెలంగాణ ఐటీశాఖ మంత్రికి కరోనా పాజిటివ్ ..ట్విట్టర్‌ ద్వారా వెల్లడించిన కేటీఆర్

KTR | CORONA : తెలంగాణ ఐటీశాఖ మంత్రికి కరోనా పాజిటివ్ ..ట్విట్టర్‌ ద్వారా వెల్లడించిన కేటీఆర్

మంత్రి కేటీఆర్(FILE PHOTO)

మంత్రి కేటీఆర్(FILE PHOTO)

KTR | CORONA: తెలంగాణ ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణమైంది. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణమైంది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కోవిడ్ టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్‌గా నిర్ధారణైందని మంత్రి స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు తాను హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నట్లుగా తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ దయచేసి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్ధించారు.సెలబ్రిటీల పరామర్శ..
ఇప్పటికే కాలు నొప్పితో బాధపడుతున్న మంత్రి కరోనా బారినపడినట్లు వెల్లడించడంతో గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. పార్టీకి చెందిన ముఖ్యనేతలతో పాటు పలువురు ప్రముఖులు ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని త్వరగా రికవరీ కావాలని కోరుతున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Corona effect, Minister ktr, Telangana News

ఉత్తమ కథలు