Home /News /telangana /

TS POLITICS TELANGANA INTI PARTY IS GOING TO MERGE IN CONGRESS TODAY AND THE PARTY CHIEF CHERUKU SUDHAKAR IS GOING TO JOIN CONGRESS PRV

Telangana: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం.. నేడు కాంగ్రెస్​లోకి ఆ పార్టీ విలీనం

revanth reddy

revanth reddy

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే దారి పట్టడం వంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఇదే కోవలో మరో వార్త తెలంగాణ రాజకీయాలను ఊపేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) రోజుకో మలుపు తిరుగుతున్నాయి.  మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati reddy rajagopal reddy) ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి రాజీనామా చేయడం, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే దారి పట్టడం వంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఇదే కోవలో మరో వార్త తెలంగాణ రాజకీయాలను ఊపేసింది. తెలంగాణ ఇంటి పార్టీ (Telangana Inti party) అధ్యక్షుడు చెరుకు సుధాకర్ (Cheruku sudhakar) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శుక్రవారం ఉదయం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth reddy) సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారు.

    చెరుకు సుధాకర్​తో రేవంత్​ (Photo: Twitter)


    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారు. దీంతో మునుగోడు (Munugodu) స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా వచ్చే అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి (BJP) తరఫున బరిలోకి దిగనున్నారు. దీంతో మునుగోడు నుంచి చెరుకు సుధాకర్ ను పోటీకి దింపాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. చెరుకు సుధాకర్ కు గురువారం ఉదయం కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. ఎఐసిసి పెద్దలతో దాదాపు 4 గంటల పాటు చెరుకు సుధాకర్ చేరికపై చర్చలు జరిగాయి. అధిష్టానం నుంచి లైన్ క్లియర్ కావడంతో చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అదే సమయంలో చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar) తన తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు.



    చెరుకు సుధాకర్ 1961 ఆగస్టు 31వ తేదీన నల్లగొండ జిల్లా గుండ్రంపల్లిలో జన్మించారు. గాంధీ మెడికల్ కళాశాల నుంచి ఎంబిబిఎస్ డిగ్రీ తీసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం 1997 నుంచి పోరాటం చేస్తూ వచ్చారు. మలిదశ ఉద్యమంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపు మేరకు టిఆర్ెస్ లో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన టిఆర్ఎస్ కు రాజీనామా చేసి తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించారు. తెలంగాణ ఇంటి పార్టీ నుంచి 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

    కీలక సమయంలో పార్టీలోకి చేరికలు..

    ఆరు నెలల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై  చెరుకు సుధాకర్ తో కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతోంది. మూడు నెలల కిందట రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీ సైతం ఆయనతో చర్చించారు. తెలంగాణ ఉద్యమకారులతో మాట్లాడారు. కేసీఆర్ ను గద్దె దింపేందుకు ఉద్యమకారులు కలిసి రావాలని రాహుల్ సూచించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ, నల్గొండ ఉమ్మడి జిల్లాలో కొమటిరెడ్డి బ్రదర్స్ కారణంగా ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా పరిణామాలతో చెరుకు సుధాకర్ పార్టీ విలీనం మరోసారి తెరపైకి వచ్చింది. కీలక సమయంలో పార్టీలోకి చేరికలు, నల్గొండ జిల్లాలో బలం పెంచుకునేందుకు ఏఐసీసీ పలు సూచనలు జారీ చేసింది. ఈ పరిణామాల్లోనే తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Nalgonda, Revanth Reddy, Telangana Politics, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు