తెలంగాణ గవర్నర్ తమిళి సై (Governor Tamilisai) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కార్ వైఖరిపై కేంద్రానికి నివేదిక ఇచ్చానని అన్నారు. రిపబ్లిక్ డే జరపడం తెలంగాణ ప్రభుత్వానికి ఇష్టంలేదని వ్యాఖ్యానించారు. ఇందుకోసం కరోనా నిబంధనలు సాకుగా చూపుతున్నారని ఆరోపించారు. సీఎం సభకు మాత్రం కరోనా నిబంధనలు వర్తించవా ? అని గవర్నర్ ప్రశ్నించారు. సీఎం సభకు 5 లక్షల మందికి వచ్చేలా ఏర్పాట్లు చేశారని గుర్తు చేశారు. హైకోర్టు (High Court) ఖండించినా సర్కార్ వైఖరి మారలేదని అన్నారు. తెలంగాణ రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ప్రోటోకాల్‌పై గవర్నర్ తమిళిసై స్పందించారు. కలెక్టర్, ఎస్పీ సహా అందరిపై చర్యలు తీసుకునే అధికారం తనకు ఉందన్న గవర్నర్ తమిళిసై.. ఎవరో ఆదేశాలకు అధికారులను శిక్షించడం సరికాదని చెప్పారు. తన వల్ల వారికి బ్లాక్ మార్క్ రావడం ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. అందుకే అధికారులపై చర్యలు తీసుకోవడం లేదని చెప్పుకొచ్చారు.
అంతకుముందు రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తమిళిసై.. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాను కొందరికి నచ్చకపోవచ్చని.. కానీ తెలంగాణ అంటే తనకు ఇష్టమని అన్నారు. ఎంతకష్టమైనా తెలంగాణ (Telangana) ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు.
రాజ్యాంగం ప్రకారమే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది... తెలంగాణ అభివృద్ధిలో తన పాత్ర తప్పక ఉంటుందని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని.. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదామని చెప్పారు. కొందరికి ఫార్మ్‌హౌస్‌లు కాదు.. అందరికీ ఫార్మ్‌లు కావాలని అన్నారు. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని.. తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణ యువత ధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానని కోరారు.
Nagoba Temple: నాగోబా ఆలయ అభివృద్ధికి నిధులు..ఎన్ని కోట్లో తెలుసా?
Telangana: గవర్నర్ తమిళిసైకి ఎమ్మెల్సీ కవిత కౌంటర్..ఆ విషయంలో ధన్యవాదాలు చెబుతూ ట్వీట్
అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదని... అభివృద్ధి అంటే జాతి నిర్మాణమని చెప్ప్ారు. తెలంగాణలో పెద్ద ఎత్తున హైవేలు నిర్మించిన ప్రధానికి గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలకు ప్రభుత్వ పెద్దలు హాజరు కాలేదు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.