హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: బండి సంజయ్‌తో మాజీ ఎంపీ భేటీ ? కాషాయ కండువా కప్పుకుంటారా ?

Telangana: బండి సంజయ్‌తో మాజీ ఎంపీ భేటీ ? కాషాయ కండువా కప్పుకుంటారా ?

కొండా విశ్వేశ్వర్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కొండా విశ్వేశ్వర్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Konda Vishweshwar Reddy: రేపు తెలంగాణకు బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వస్తున్న తరుణంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బండి సంజయ్‌, జితేందర్ రెడ్డిలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. పార్టీలోకి కీలక నేతలను తీసుకొచ్చేందుకు అదే స్థాయిలో శ్రమిస్తోంది. ఇప్పటికే కొంతమంది నేతలు బీజేపీ గూటికి చేరిపోగా.. తాజాగా మరో మాజీ ఎంపీ కడా బీజేపీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. చేవేళ్ల నుంచి టీఆర్ఎస్ ఎంపీగా వ్యవహరించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy).. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కొంతకాలం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణలో(Telangana) టీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న నాయకుల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒకరు. ఈయన కాంగ్రెస్‌లో చేరతారా ? లేక బీజేపీలోకి వెళతారా ? అన్న ప్రశ్న చాలాకాలం వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో (Bandi Sanjay) సమావేశమయ్యారు.

అంతకుముందు ఆయన బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో సమావేశమయ్యారు. రేపు తెలంగాణకు బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వస్తున్న తరుణంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బండి సంజయ్‌, జితేందర్ రెడ్డిలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జేపీ నడ్డా సమక్షంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరతారా ? లేక ఈ నెలలోనే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు కార్యక్రమానికి రాబోతున్న ఆ పార్టీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరతారా ? అన్నది చూడాల్సి ఉంది.

తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఓడించే పార్టీలో చేరాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలోని నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తరువాత విశ్వేశ్వర్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ గూటికి వెళతారని అంతా అనుకున్నారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన తరువాత ఆయనను కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రయత్నించారు.

TS Politics: తెలంగాణ మాజీమంత్రి మళ్లీ డైలమాలో పడిపోయారా ? ఎటూ తేల్చుకోలేకపోతున్నారా ?

Big News: ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు తెలంగాణ హైకోర్టు అనుమతి

అయితే హుజూరాబాద్‌లో బీజేపీ తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్‌ను గెలిపించాలని ఆ ప్రాంత ప్రజలకు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. అయితే కాంగ్రెస్, బీజేపీల్లో ఆయన ఏ పార్టీలోకి వెళతారనే దానిపై క్లారిటీ రావడానికి కొంత సమయం పడుతందని చాలామంది భావించారు. అయితే ఉన్నట్టుండి ఆయన బండి సంజయ్‌‌ను కలవడం.. అది కూడా జేపీ నడ్డా రాష్ట్రానికి రావడానికి ముందు రోజు ఆయనతో సమావేశం కావడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

First published:

Tags: Konda Vishweshwar reddy, Telangana

ఉత్తమ కథలు