Home /News /telangana /

TS POLITICS TELANGANA EX MINISTER TUMMALA NAGESHWARA RAO SENSATIONAL COMMENTS IN FOLLOWERS MEETING MAY GIVE SHOCK TO TRS AK

Telangana: టీఆర్ఎస్‌కు మరో షాక్ తగలనుందా ?.. ఆ మాజీమంత్రి మాటలకు అర్థమేంటి ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Tummala Nageshwara Rao: గతంలో చేసిన తప్పులు ఇప్పుడు మళ్లీ జరగకుండా చూసుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు అనుచరులకు సూచించారు. మంత్రిగా ఉన్న సమయంలో కేవలం అభివృద్ధి మీదే దృష్టి పెట్టానని అన్నారు.

    తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు స్థానానికి మరికొద్ది నెలల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మరోవైపు వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్‌కు చెందిన నాయకుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్‌కు ఇంకెంతమంది నేతలు గుడ్ బై చెబుతారో అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన మాజీమంత్రి, సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageshwara Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు, ముఖ్య అనుచరులతో సమావేశమైన తుమ్మల నాగేశ్వరరావు.. ఏ క్షణమైన పిడుగు పడొచ్చని అన్నారు. ఇందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.

    గతంలో చేసిన తప్పులు ఇప్పుడు మళ్లీ జరగకుండా చూసుకోవాలని వారికి సూచించారు. మంత్రిగా ఉన్న సమయంలో కేవలం అభివృద్ధి మీదే దృష్టి పెట్టానని అన్నారు. కార్యకర్తల కోసం ఇప్పుడు పూర్తి సమయం కేటాయిస్తానని అన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగానని అన్నారు. ఇప్పుడు పాలేరు నియోజకవర్గం మీదే దృష్టి పెడతానని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అయితే తుమ్మల నాగేశ్వరావు ఉన్నట్టుండి ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక కారణం ఏంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.



    తెలంగాణలో బలమైన నాయకులను తమ పార్టీలోకి తీసుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ఖమ్మం (Khammam) జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు బలమైన నేత. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయనకు అనుచరులు ఉన్నారు. టీఆర్ఎస్‌లో కొంతకాలంగా తనకు ప్రాధాన్యత తగ్గిందనే భావనలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు.. బీజేపీ(BJP) వైపు చూస్తున్నారా ? అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

    Munugodu| TRS: మునుగోడులో కాంగ్రెస్ దూకుడు.. టీఆర్ఎస్‌కు కలిసొచ్చే అంశమా ?

    Telangana Politics: ‘‘ఆయన మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి’’: BJP MLA ఈటల రాజేందర్​

    అయితే కొద్దిరోజుల క్రితం గోదావరి వరదల కారణంగా మునిగిపోయిన భద్రాచలంలో పర్యటించిన సీఎం కేసీఆర్.. తుమ్మల నాగేశ్వరరావుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు మరో పార్టీ వైపు చూసే ఆలోచన చేయకపోవచ్చనే చర్చ జరుగుతోంది. అంతేకాదు తన రాజకీయ జీవితంలో టీడీపీ తరువాత టీఆర్ఎస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు.. మరోసారి పార్టీ మారేందుకు అంత సముఖంగా ఉంటారా ? అన్నది కూడా సందేహమే. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి.. తుమ్మల నాగేశ్వరరావు కూడా బీజేపీ ఆపరేషన్‌కు ఆకర్షితులై టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారా ? అనే ప్రచారం సాగుతోంది. మొత్తానికి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలకు అర్థమేంటో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana, Tummala nageshwara rao

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు