తెలంగాణ రాజకీయాలు ఎంతో వేగంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నా.. అప్పుడే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ఇక తమ రాజకీయ భవిష్యత్తు విషయంలో స్పష్టత లేని కొందరు నేతలు సైతం.. పార్టీ మారేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో కొనసాగుతున్నా.. ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) పార్టీ మార్పు వ్యవహారం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొన్నేళ్ల నుంచి టీఆర్ఎస్ తీరుపై అసంతృప్తితో ఉన్న జూపల్లి.. పార్టీ మారేందుకు దాదాపుగా రెడీ అయిపోయారన వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆయన ఖమ్మం(khammam) జిల్లాకు వెళ్లి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చలు జరపడంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.
జూపల్లి వారితో కలిసి పార్టీ మారతారా ? లేక తనతో కలిసి వారిని మరో పార్టీలోకి రావాలని ఆహ్వానించారా ? అన్న అంశంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. టీఆర్ఎస్‌పై అసంతృప్తిగా ఉన్న జూపల్లి పార్టీ మారడం దాదాపు ఖాయమే అయినా.. ఆయన ఏ పార్టీలోకి వెళతారు అనే అంశంపై ఎవరికీ క్లారిటీ లేదు. ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారని కొందరు.. అయితే కాంగ్రెస్‌లో వెళ్లే ఆప్షన్‌ను కూడా పెట్టుకున్నారని మరికొందరు భావించారు.
అయితే నియోజకవర్గంలో నిత్యం ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించుకున్న జూపల్లి కృష్ణారావు.. పార్టీ మార్పు విషయంలో మాత్రం మరికొంత సమయం వేచి చూడాలనే ఆలోచనతో ఉన్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో మంచి దూకుడు మీదున్న బీజేపీలోకి(BJP) వెళ్లాలని ఆయన అనుచరుల్లోని ఎక్కువమంది ఒత్తిడి తీసుకొస్తున్నారట. పాలమూరు జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా కాషాయం కండువా కప్పుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారట.
Big News: ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు తెలంగాణ హైకోర్టు అనుమతి
BJP| Telangana: టార్గెట్ తెలంగాణ.. బీజేపీ హైకమాండ్ మరో కీలక నిర్ణయం.. త్వరలోనే వారికి బాధ్యతలు ?
అయితే రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న జూపల్లి కృష్ణారావు.. పార్టీ మారే విషయంలో మాత్రం అంత తొందరపడొద్దనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ కూడా బలంగానే ఉండటం.. కొల్లాపూర్‌లో తాను గతంలో కాంగ్రెస్ తరపున పలుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో.. ఆ దిశగా కూడా మాజీమంత్రి ఆలోచిస్తున్నారని సమాచారం. మొత్తానికి టీఆర్ఎస్ తీరుపై అసంతృప్తితో ఉన్న మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు.. పార్టీ మారే విషయంలో మాత్రం ఆచితూచి ముందుకు సాగాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana